నాణ్యమైన భోజనం అందించాలి
జనగామ రూరల్: జిల్లాలోని అన్ని పాఠశాలలు, వసతి గృహాలు, ఆస్పత్రుల్లో అందిస్తున్న మధ్యా హ్న భోజన పథకం అమలును పర్యవేక్షిస్తూ, విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించేవిధంగా చూ డాలని కలెక్టర్ రిజ్వాన్ బాషా అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్‌లో అదనపు కలెక్టర్లు పింకేష్ కుమార్, రోహిత్ సింగ్‌లతో కలిసి కలెక్టర్ జిల్లా అధికారులతో సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ మధ్యాహ్న భోజన పథకం అమలును పరిశీలించేందుకు జిల్లా ఫుడ్ సేఫ్టీ కమిటీలను ఏర్పాటు చేశామన్నారు. అదనపు కలెక్టర్లతో కలిసి రెండు కమిటీల్లో డీపీఓ, డీఎం సీఎస్, జెడ్పీ సీఈఓ, జీసీడీఓ స భ్యులుగా ఉంటారని, (రెవెన్యూ) కమిటీలో డీ ఎల్పీఓ, డీసీఎస్‌ఓ, డిప్యూటీ జెడ్పీ సీఈఓ, జిల్లా కో–ఆర్డినేటర్లు సభ్యులుగా ఉంటారన్నారు. అదనపు కలెక్టర్ పింకేష్‌కుమార్‌కు జనగామ, లింగాలఘణపురం, బచ్చన్నపేట, నర్మెట, తరిగొప్పుల, రఘునాథపల్లి, అధనపు కలెక్టర్ రోహిత్‌సింగ్‌కు పా లకుర్తి, కొడకండ్ల, దేవరుప్పుల, జఫర్‌గఢ్, చిల్పూర్, ఘనపూర్ (స్టేషన్) లను కేటాయించామన్నారు. అలాగే సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే డేటా ఆన్‌లైన్ నమోదు ప్రక్రియలో వేగం పెంచాలని, ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ, వారంలోగా నమోదు ప్రక్రియను పూర్తిచేయాలని అధికారులను ఆదేశించారు. ఈ సమావేశంలో స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ సుహాసిని, డీఆర్‌డీఓ వసంత, డీఈఓ రాము, డీపీఓ స్వరూప, డీఏఓ రామారావు నాయక్, జిల్లా అధికారులు పాల్గొన్నారు.
కలెక్టర్ రిజ్వాన్ బాషా
Comments
Please login to add a commentAdd a comment