జనగామ: ప్రభుత్వ వైద్య కళాశాలలో ఖాళీలుగా ఉన్న 50 అవుట్‌సోర్సింగ్ ఉద్యోగాల నియామకం నిబంధనల మేరకు చేపట్టినట్లు కళాశాల ప్రిన్సిపాల్ గోపాల్‌రావు సోమవారం తెలిపారు. ఇటీవల జారీ చేసిన నోటిఫికేషన్‌కి సంబంధించిన దరఖాస్తులను వైద్య కళాశాల, జనగామ సిబ్బంది పరిశీలన చేసిన తర్వాత, నలుగురు ప్రొఫెసర్‌లతో కూడిన ఎంపిక కమిటీ ఫైనల్ చేసి ప్రొవిజనల్ మెరిట్ ప్రకటించటం జరిగిందన్నారు. ఈ మెరిట్ లిస్ట్‌పై వారం రోజుల పాటు అభ్యంతరాలను తీసుకుంటామన్నారు. ఇందులో డ్రైవర్ పోస్టులకు గాను ట్రాన్స్‌పోర్ట్ లైసెన్స్ సీనియారిటీని పరిగణలోకి తీసుకోవడంతో పాటు ప్రస్తుతం వైద్య కళాశాలలో పనిచేస్తున్న ఉద్యోగులకు సంవత్సరానికి 2పాయింట్లు అదననంగా కలుపుతామన్నారు. రూల్ ఆఫ్ రిజర్వేషన్ అనుసరించి తుది జాబితా సంబంధిత వెబ్‌సైట్‌లో ఉందన్నారు. డాటా ఎంట్రీ ఆపరేటర్ పోస్టులకు ఎంపికై న అభ్యర్థులు కలెక్టర్, అడిషనల్ కలెక్టర్ ఆధ్వర్యంలో కంప్యూటర్ ఆధారిత పరీక్ష నిర్వహించి ఎంపిక చేస్తామన్నారు.
Comments
Please login to add a commentAdd a comment