రాష్ట్ర మహాసభలను జయప్రదం చేయాలి
రఘునాథపల్లి : జిల్లా కేంద్రంలో ఈ నెల 29న నిర్వహించనున్న తెలంగాణ రజక రిజర్వేషన్ సమితి (టీఆర్‌ఆర్‌ఎస్) రాష్ట్ర స్థాయి మూడో మహాసభలను జయప్రదం చేయాలని ఆ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు గోపి, జిల్లా అధ్యక్షుడు ఏదునూరి నరేష్ పిలుపు నిచ్చారు. ఆదివారం మండల కేంద్రంలో సంఘం మండల అధ్యక్షుడు మరికుక్కల యాదగిరి, యాకయ్య, ఉమేశ్, మహేశ్‌ల ఆధ్వర్యంలో మహాసభ వాల్ పోస్టర్లు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా గోపి మాట్లాడుతూ రజకులంతా ఐక్యతతో ముందుకు సాగాలని కోరారు. మహాసభలకు రజకులు అధిక సంఖ్యలో తరలి రావాలని కోరారు. జిల్లా గౌరవ అధ్యక్షుడు ఉల్లెంగుల రాములు, కొలిపాక రాములు, అనిల్, నర్సింహులు, హరీష్, రాజు, లక్ష్మణ్, ఉద్విత్, మియన్స్, నరేష్, సంతోష్, అయోధ్య, ప్రశాంత్, మధుసూదన్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment