నిడిగొండ గుట్టపై శంఖుచక్ర నామాలు
రఘునాథపల్లి మండలం నిడిగొండ గ్రామంలో కాకతీయుల కాలం నాటి లక్ష్మీనర్సింహస్వామి, శివా లయం, త్రికుటాలయం గుట్టపై ఓ భక్తుడి సహకారంతో స్థానికులు శంఖుచక్ర నామాలు గీయించారు. తాళ్ల సాయంతో నాలుగు రోజులుగా 100 మీటర్ల ఎత్తు, 50 మీటర్ల వెడల్పులో 80 లీటర్ల పెయింట్‌తో గీస్తున్నట్లు పెయింటర్ మేడ స్వామి తెలిపారు. వరంగల్, హైదరాబాద్ జాతీయ రహదారిపై రాకపోకలు సాగించే ప్రయాణికులకు రఘునాథపల్లి నుంచి యశ్వంతాపూర్ వరకు స్పష్టంగా కనిపించేలా ఆర్ట్ చేశారు. ఈ చిత్రీకరణలో భాగస్వాములైన మేడ స్వామి, కొంగరి నర్సింగరావు, శ్రీకాంత్, నిఖిల్, అరవింద్, జయపాల్‌రెడ్డి, ప్రశాంత్, అభిషేక్, నరేందర్‌రెడ్డిలను స్థానికులు అభినందించారు. – రఘునాథపల్లి
Comments
Please login to add a commentAdd a comment