అమిత్‌షాను బర్తరఫ్ చేయాలి
● ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి
జనగామ రూరల్: భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేడ్కర్‌పై అనుచిత వ్యాఖ్యలు చేసిన కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాను వెంటనే బర్తరఫ్ చేయాలని ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి డిమాండ్ చేశారు. ఆదివారం జిల్లా కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో డీసీసీ అధ్యక్షుడు కొమ్మూరి ప్రతాప్‌రెడ్డి అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. గత ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో మోదీ ప్రభుత్వం విఫలమైందన్నారు. ప్రజా సమస్యలను పక్కకు పెట్టి కులం, మతం పేరుతో ప్రజల మధ్య చిచ్చుపెట్టే ప్రయత్నం చేస్తున్నారన్నారు. డీసీస అధ్యక్షుడు కొమ్మూరి మాట్లాడుతూ బహుజనుల ఆశాజ్యోతి అంబేడ్కర్ లేకుంటే అమిత్ షా ఎంపీ ఎలా అయ్యేవాడో చెప్పాలన్నారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ బనుక శివరాజ్, పీసీసీ సభ్యుడు చెంచారపు శ్రీనివాస్, వేముళ్ల సత్యనారాయణ రెడ్డి, నర్సిరెడ్డి, మహిళా అధ్యక్షురాలు బడికే ఇందిరా, కౌన్సిలర్ అనిత తదితరుల పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment