సమగ్ర శిక్ష ఉద్యోగుల డిమాండ్లు నెరవేర్చాలి
● టీయూటీఎఫ్ రాష్ట్ర బాధ్యుడు రమేశ్
జనగామ రూరల్: సమగ్ర శిక్ష ఉద్యోగుల న్యాయమైన డిమాండ్లను సీఎం రేవంత్‌రెడ్డి నేరవేర్చాలని టీయూటీఎఫ్ రాష్ట్ర బాధ్యుడు బుర్ర రమేశ్ డిమాండ్ చేశారు. సమగ్ర శిక్ష ఉద్యోగులు చేపట్టిన నిరవధిక దీక్షలు ఆదివారం 13వ రోజుకు చేరుకున్నాయి. ఉపాధ్యాయులు బుర్ర రమేశ్, పగడాల భాస్కర్, కనకయ్య, రేణిగుంట్ల మురళి పాల్గొని సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా బుర్ర రమేశ్ మాట్లాడుతూ 20 ఏళ్లుగా పని చేస్తున్న సమగ్ర శిక్ష ఉద్యోగులను తక్షణమే విద్యాశాఖలో విలీనం చేసి రెగ్యులరైజ్ చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం న్యాయమైన డిమాండ్లు నెరవేర్చే వరకు అలుపెరగని పోరాటం చేయాలని, కొట్లాడి సాధించిన తెలంగాణలో అదే ఉద్యమ స్ఫూర్తితో హక్కులను సాధించుకోవాలన్నారు. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు సమాన పనికి సమాన వేతనం చెల్లించాలన్నారు. ఈ కార్యక్రమంలో వెంకటేశ్వర రెడ్డి, ఉప్పల వసంత, లావణ్య, వెంకటేశ్వర్లు, కనకయ్య, సమగ్ర శిక్ష ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షుడు తాడూరు రమేశ్, ప్రధాన కార్యదర్శి దయాకర్, రవీందర్ రెడ్డి, వెంకటేశ్వర్లు, శ్రీలత, సుకన్య, శివకుమార్, స్వామి ఉమాపతి, విజయ, సుకన్య, రాణి, తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment