రాష్ట్ర స్థాయి సాక్షి స్పెల్ బీకి జనగామ విద్యార్థి
జనగామ రూరల్: విద్యార్థుల ప్రతిభను వెలికి తీసేందుకు సాక్షి మీడియా ఆధ్వర్యంలో నిర్వస్తున్న స్పెల్ బీ పరీక్షలో భాగంగా ఆదివారం హైదరాబాద్‌లో జరిగిన రాష్ట్ర స్థాయి పరీక్షకు జనగామకు చెందిన కీర్తి వీరేందర్ కుమార్తె యుక్తిక రాజ్ వెళ్లారు. ఇటీవల జిల్లాలో నిర్వహించిన సాక్షి స్పెల్ బీ పరీక్షలో విద్యార్థిని యుక్తిక ప్రతిభ కనబర్చి రాష్ట్ర స్థాయికి అర్హత సాధించారు. సాక్షి నిర్వహిస్తున్న కార్యక్రమంతో తమకు మరింత మనోధైర్యం కలుగుతుందని, భవిష్యత్‌లో జరిగే పోటీ పరీక్షల్లో ఎలాంటి ఒత్తిడి లేకుండా సులువుగా రాసేవిధంగా ఉందన్నారు. ఈ సందర్భంగా విద్యార్థితో పాటు వీరేందర్ సాక్షికి కృతజ్ఞతలు తెలిపారు.
రేపు గూడూరు శిలాశాసన నవ శతాబ్ది వేడుకలు
పాలకుర్తి టౌన్: గూడూరు శిలాశాసన నవశతాబ్ది వేడుకలు (900 సంవత్సరాలు) ఈనెల 24న మంగళవారం పాలకుర్తి మండలం గూడూరులోని గ్రామ పంచాయతీ ఆవరణంలో నిర్వహించనున్నట్లు శ్రీపోతన చైతన్య వేదిక గూడూరు అధ్యక్షుడు అనుముల ఎల్లయ్య ఆదివారం ఒక ప్రకటనలో తెలిపా రు. గూడురు శాసనం నవశతాబ్ధి మహోత్సవం సందర్భంగా గూడూరు శిలాశాసన స్మృతి వ్యాసమాలిక పూస్తకాని ఎమ్మెల్యే మామిడాల యశస్వినిరెడ్డి ఆవిష్కరిస్తారన్నారు. ఈ కార్యక్రమానికి కేయూ విశ్రాంత ప్రొఫెసర్ డాక్టర్ విజయబాబు, సాహిత్యకారుడు లింగంపల్లి రామచంద్ర, యల్లం భట్ల నాగయ్య, రచయితలు డాక్టర్ శంకరమంచి శ్యాంప్రసాద్, సోమనాథ కళాపీఠం అధ్యక్షుడు డాక్టర్ రాపోలు సత్యనారాయణ, చరిత్ర పరిశోధకుడు కేవీ గోపాల కృష్ణమాచార్యులు, ఆర్తి పరాంకుశం పాల్గొంటారని తెలిపారు.
గౌడ ఐక్య సాధన సమితి రాష్ట్ర అధికార ప్రతినిధిగా నర్సయ్య
లింగాలఘణపురం: గౌడ ఐక్య సాధన సమితి రాష్ట్ర అధికార ప్రతినిధిగా నవాబు పేటకు చెందిన బూడిద నర్సయ్యగౌడ్‌ను నియమిస్తూ రాష్ట్ర అధ్యక్షుడు అంబాల నారాయణగౌడ్ ఉత్తర్వులు జారీ చేశారు. ఇప్పటి వరకు జనగామ జిల్లా అధ్యక్షుడిగా పని చేసిన నర్సయ్యగౌడ్ సేవలను మరింత విస్తృతం చేసేందుకు రాష్ట్ర అధికార ప్రతినిధిగా నియమించినట్లు తెలిపారు. ఈ సందర్భంగా నర్సయ్యగౌడ్ మాట్లాడుతూ గౌడ సమస్యల పరిష్కారానికి తమవంతుగా కృషి చేస్తానన్నారు. తన నియామకానికి సహకరించిన పెద్దలందరికీ కృతజ్ఞతలు తెలిపారు.
పత్తిమిల్లులో అగ్ని ప్రమాదం
దేవరుప్పుల : మండలంలోని ధర్మగడ్డ గ్రామ పంచాయతీ పరిధిలో ఉన్న వినాయక పత్తి మిల్లులో షార్ట్‌సర్క్యూట్ కారణంగా ఆదివారం అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. సుమారు 50 క్వింటాళ్ల పత్తి దగ్ధమైంది. పత్తిమిల్లు యజమాని శ్రీనివాసులు సమాచారం మేరకు జనగామ అగ్నిమాపక కేంద్రం సిబ్బంది మంటలు ఆర్పడంతో ప్రమాదం తప్పింది.
కేయూలో ఐసెట్ కార్యాలయానికి సీల్
కేయూ క్యాంపస్: కాకతీయ యూనివర్సిటీలోని కామర్స్ అండ్ బిజినెస్ మేనేజ్‌మెంట్ కళాశాలలోని ఐసెట్ కార్యాలయానికి రిజిస్ట్రార్ ఆచార్య పి.మల్లారెడ్డి తాళం వేసి సీల్ చేశారు. 12 ఏళ్లుగా కాకతీయ యూనివర్సిటీయే టీఎస్ ఐసెట్ నిర్వహించిన నేపథ్యంలో ఆ కళాశాలలో ప్రత్యేకంగా ఒక హాల్‌ను కార్యాలయంగా ఏర్పాటుచేసి అవసరమైన ఫర్నిచర్, టేబుళ్లు, కంప్యూటర్లు తదితర సామగ్రిని సమకూర్చా రు. ఈసారి ఐసెట్ నిర్వహణను ఉన్నత విద్యామండలి కేయూకు అప్పగించకపోవడంతో ఐసెట్ కార్యాలయం నిరుపయోగంగా మారింది. ఈ కార్యాలయం నుంచి రెండు చైర్లు ఎవరో బయటికి తీసుకెళ్లారని ఆరోపిస్తూ రెండురోజుల క్రితం ఒకరు రిజిస్ట్రార్ దృష్టికి తీసుకెళ్లారని సమాచారం. దీంతో ఆయన కళాశాలను సందర్శించి ప్రత్యక్షంగా పరిశీలించారు. అక్క డ స్టాక్ రిజిస్టర్ మెయింటేన్ చేయటంలేదనేది గుర్తించిన రిజిస్ట్రార్.. ప్రస్తుతం ఉన్న ఫర్నిచర్ రిజిస్టర్‌లో పొందుపరిచి కార్యాలయానికి తా ళం వేయించారు. అందులోని వస్తువుల జాబి తా పత్రాన్ని ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ అమరవేణికి అందజేసినట్లు ఆదివారం వెల్లడించారు.
Comments
Please login to add a commentAdd a comment