గీత కార్మికులను ఆదుకోవాలి
పాలకుర్తి : మండలంలోని రాఘవపురం గ్రామానికి చెందిన గీత కార్మికుడు పూజారి సతీష్ వృత్తిలో భాగంగా ఇటీవల కల్లు గీస్తుండగా చెట్టుపై నుంచి జారిపడడంతో తీవ్రంగా గాయపడ్డాడు. కాగా గౌడజన హక్కుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మూల వెంకటేశ్వర్లు ఆదివారం సతీష్‌ను పరామర్శించారు. గాయపడిన సతీష్‌ను ప్రభుత్వం ఆదుకోవాలని కోరారు. గీత కార్మికులకు పెండింగ్‌లో ఉన్న ఎక్స్‌గ్రేషియాను వెంటనే విడుదల చేయాలని తెలిపారు. నాయకులు కమ్మగాని పరమేశ్వర్, గూడ దామోదర్, బండి సోమయ్య, బుర్ర కుమార్, పొడిశెట్టి వెంకన్న, కమ్మగాని యాకయ్య, పూజారి నారాయణ, పూజారి కుమారస్వామి, పూజారి నరేష్‌లు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment