‘పార్లమెంట్ సభ్యత్వాన్ని రద్దు చేయాలి’
జఫర్‌గఢ్ : రాజ్యాంగ నిర్మాత బీఆర్ అంబేడ్కర్‌పై అవమానకరమైన వ్యాఖ్యలు చేసిన కేంద్ర హోం మంత్రి అమిత్ షా పార్లమెంట్ సభ్యత్వాన్ని వెంటనే రద్దు చేయడంతోపాటు హోం మంత్రి పదవి నుంచి తొలగించాలని సీపీఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యుడు రాపర్తి సోమయ్య, పార్టీ మండల కార్యదర్శి గుండెబోయిన రాజు డిమాండ్ చేశారు. సీపీఎం ఆధ్వర్యంలో మండల కేంద్రంలో ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలు అమిత్ షా దిష్టిబొమ్మను ఆదివారం దహనం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అమిత్ షా తన పదవికి రాజీనామా చేయడంతో పాటు క్షమాపణ చెప్పాలని నినాదాలు చేశారు. అంబేడ్కర్‌పై అవమానకరమైన విధంగా అమిత్ షా వ్యాఖ్యలు చేయడం సిగ్గుచేటన్నారు. నాయకులు కాట సుధాకర్, ఎంపెల్లి అజయ్, రాజు, గబ్బెట కొమురయ్య, సాకి నర్సింగం, ఎర్ర రవి, శోభా, రాజయ్య తదితరులు పాల్గొన్నారు.
అమిత్ షా దిష్టిబొమ్మను
దహనం చేసిన సీపీఎం నాయకులు
Comments
Please login to add a commentAdd a comment