సాగునీటి కాల్వ పనులు ప్రారంభం
రఘునాథపల్లి : పంటలకు సాగునీరు అందించే ప్రధాన కాల్వ మరమ్మతు పనులను కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆదివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ మారజోడు రాంబాబు మాట్లాడుతూ మండలంలోని బోయినిగూడెం నుంచి కంచనపల్లి మీదుగా నవాబుపేట రిజర్వాయర్‌కు వెళ్లే ప్రధాన కాల్వను శనివారం పరిశీలించి ఎమ్మెల్యేకు విన్నవించడం జరిగిందన్నారు. అందుకు వెంటనే పనులు ప్రారంభించాలని ఆదేశించడంతో రైతుల పక్షాన ఎమ్మెల్యేకు కృతజ్ఙతలు తెలిపారు. కార్యక్రమంలో పార్టీ మండల అధ్యక్షుడు కోళ్ల రవిగౌడ్, నాయకులు జగదీశ్‌చందర్‌రెడ్డి, లింగాజి, నరేందర్, రవీందర్, శ్రావణ్ కుమార్, లక్ష్మారెడ్డి, సోమాజి, వెంకన్న, అశోక్, అంజయ్య, పథ్వీ, భాస్కర్, విజయమేరీ, పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment