విహార యాత్రలతో విజ్ఞానం
బచ్చన్నపేట : విహార యాత్రలు విజ్ఞానానికి దోహదపడతాయని మండలంలోని పడమటికేశ్వాపూర్ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు జాటోత్ విజయ అన్నారు. ఆదివారం పాఠశాలలోని 8, 9, 10వ తరగతి విద్యార్థులను హైదరాబాద్‌లోని రామోజీ ఫిల్మ్‌సిటీకి తీసుకెళ్లి పలు ప్రదేశాలను చూపించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ అక్కడ ఉన్న ప్రదేశాల ప్రాధాన్యతను విద్యార్థులకు వివరించామన్నారు. దశల వారిగా మరిన్ని చారిత్రక ప్రదేశాలను చూపిస్తామని విద్యార్థులు పాఠ్యపుస్తకాలలో చదివిన దాని కంటే చూసిన దా నిని ఎక్కువగా గుర్తు పెట్టుకుంటారని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment