విద్యాభివృద్ధిలో గణితం కీలకం
రఘునాథపల్లి : విద్యాభివృద్ధిలో ప్రతీఒక్కరికి గణితం ఎంతో కీలకమని మండలంలోని ఖిలాషాపూర్ ఉన్నత పాఠశాల హెచ్‌ఎం భారత రవీందర్ అన్నారు. ఆదివారం పాఠశాలలో జాతీయ గణిత దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులకు రామానుజన్ గణిత ఆవిష్కరణలను, వ్యాసరచన, క్విజ్, ఉపన్యాస పోటీలు, గణిత మేళా నిర్వహించారు. పాఠశాల గణిత ఉపాధ్యాయుడు సరాబు శ్రీనివాస్ మార్గదర్శకత్వంలో 6 నుంచి 10 తరగతుల విద్యార్థులు స్వయంగా తయారు చేసిన పలు రకాల ఎగ్జిబిట్లను ప్రదర్శించారు. ఈ సందర్భంగా హెచ్‌ఎం మాట్లాడుతూ విద్యార్థులు సృజనాత్మకత, క్రమశిక్షణ, నైతిక వెలువలతో పాటు పోటీ తత్వాన్ని అలవరుచుకోవాలని సూచించారు. అనంతరం ప్రతిభ చాటిన విద్యార్థులకు బహుమతులు ప్రదానం చేశారు. ఉపాధ్యాయులు పంచాక్షరీ, ప్రవీణ్‌కుమార్, నర్సయ్య, మల్లేష్, సోమన్న, కళావతి, అరవింద్, అశోక్ తదితరులు పాల్గొన్నారు.
ఘనంగా శ్రీనివాస రామానుజన్ జయంతి
స్టేషన్‌ఘన్‌పూర్ : గణితశాస్త్ర పితామహుడు శ్రీనివాస రామానుజన్ జయంతి వేడుకలను మండలంలోని ఛాగల్లు ఉన్నత పాఠశాలలో ఆదివారం ఘనంగా నిర్వహించారు. పాఠశాల ఇన్‌చార్జ్ హెచ్‌ఎం పరమేశ్వరి ఆధ్వర్యంలో విద్యార్థులకు గణిత రంగోళి, క్విజ్, వ్యాసరచన, ఉపన్యాసం, గణిత చార్ట్స్ తయారీ తదితర పోటీలను నిర్వహించారు. గణిత ఉపాధ్యాయులు కొల్లూరు ప్రకాశం, విజయకుమారి ఆధ్వర్యంలో విద్యార్థులచే గణిత మాడల్స్ ప్రదర్శన కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా ఇన్‌చార్జ్ హెచ్‌ఎం మాట్లాడుతూ ప్రపంచ గణిత మేధావుల్లో శ్రీనివాస రామానుజన్ గొప్పవారని, గణిత శాస్త్రంలో ఆయన చేసిన ఆవిష్కరణలు అద్భుతమని కొనియాడారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు శాంతి, లలితకుమారి, దేవేందర్‌కౌర్, శ్రీనివాస్, వెంకటేశ్వర్లు, వేణుగోపాల్ పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment