మిత్రుల చేయూత
నర్మెట : తమతో కలిసి చదువుకున్న మిత్రుల కుటుంబ సభ్యులు అనారోగ్యంతో మృతి చెందడంతో 2004–05 బ్యాచ్‌కు చెందిన పదో తరగతి పూర్వ విద్యార్థులు బాధిత కుటుంబాలను ఆదివారం పరామర్శించి ఆర్థికసాయం అందజేశారు. గుగులోత్ రేణుక భర్త గుగులోత్ శ్రీను (38) మృతిచెందగా వారి కుటుంబానికి రూ.15వేలు, భూక్య శ్రీను(36) కుటుంబ సభ్యులకు రూ.10 వేలు నగదు అందజేశారు. కార్యక్రమంలో తౌటిరెడ్డి రామకృష్ణా రెడ్డి, గుండేటి రాంచందర్, కొంపెల్లి అంబేడ్కర్, కేలోత్ రమేశ్, గొల్లపల్లి రాజు, భూక్య యాంజి, జడల రాజు, భూక్య మంగ, శవ్వ కృష్ణ, అరిగల రాజు, భూక్య తిరుపతి తదితరులు ఉన్నారు.
ఆర్థికసాయం
లింగాలఘణపురం : మండలంలోని గుమ్మడవెల్లి గ్రామానికి చెందిన నిమ్మకంటి రవికి ఇన్‌ఫెక్షన్ సోకడంతో కాలు తొలగించారు. దీంతో ఉపాధి కోల్పోయిన అతనికి గ్రామానికి చెందిన వలంటీర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో విరాళాలు సేకరించి రూ.56వేల ఆర్థికసాయాన్ని అందజేశారు. గ్రామంలో నాయీబ్రాహ్మణ వృతి చేసే రవి కుటుంబాన్ని ఆదుకోవాలనే సంకల్పంతో అసోసియేషన్ సభ్యులు ముందుకు వచ్చి విరాళాలు సేకరించి ఆదుకున్నారు.
ఇసుక ట్రాక్టర్ల స్వాధీనం
దేవరుప్పుల : మండలంలోని కడవెండితో పాటు ఇతర వాగుల్లో ఇసుక అక్రమ రవాణా చేస్తున్న రెండు ట్రాక్టర్లను సీజ్ చేసినట్లు ఎస్సై ఊర సృజనకుమార్ తెలిపారు. ఈ మేరకు ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. కడవెండి రెవెన్యూ పరిధి పొట్టిగుట్ట తండాకు చెందిన గూడ వీరన్న, నరసింహ తమ ట్రాక్టర్ల ద్వారా ఇసుకను అక్రమంగా రవాణా చేస్తుండగా పట్టుకొని సీజ్ చేసినట్లు ఎస్సై తెలిపారు. నిబంధనలకు విరుద్ధంగా ఎవరైనా ఇసుక ర వాణాకు పాల్పడినా చట్టపరమైన చర్యలు త ప్పవని ఎస్సై సృజనకుమార్ హెచ్చరించారు.
వాహనాల తనిఖీ
బచ్చన్నపేట : మద్యం తాగి వాహనాలు నడుపరాదని, ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని ఎస్సై ఎస్‌కే హమీద్ సూచించారు. ఆదివారం మండల కేంద్రంలో ఆయన వాహనాల తనిఖీ చేపట్టారు. ఈ సందర్భంగా ఎస్సై మాట్లాడుతూ ప్రమాదాలు జరిగినప్పుడు హెల్మెట్ ప్రాణాలను కాపాడుతుందని, బైక్‌పై ముగ్గురు ప్రయాణం చేయరాదన్నారు. మైనర్లకు వాహనాలు ఇస్తే వారి తల్లిదండ్రులపై కేసులు నమోదు చేస్తామని, డ్రైవింగ్ లైసెన్స్ కలిగి ఉండాలని తెలిపారు.
గుడుంబా తయారీదారుల అరెస్ట్
ఇద్దరిపై కేసు.. వాహనాలు స్వాధీనం
చిల్పూరు : నిషేధిత గుడుంబాను తయారు చేయడంతో పాటు విక్రయానికి తరలిస్తున్న ఇద్దరిని అరెస్టు చేసి వారి వాహనాలను స్వాధీనం చేసుకున్నట్లు ఎకై ్సజ్ సీఐ భాస్కర్‌రావు, ఎస్సై నరేష్ తెలిపారు. ఈ సందర్భంగా ఆదివారం వారు వివరాలు వెల్లడించారు. జిల్లా ప్రొహిబిషన్ అండ్ ఎకై ్సజ్ అధికారి అనిత ఆదేశాల మేరకు మండల పరిధిలోని ఎర్రకుంటతండా పరిధిలో అక్రమంగా గుడుంబా తయారు చేయడంతో పాటు వివిధ ప్రాంతాలకు తరలిస్తున్నట్లు పక్కా సమాచారం అందింది. దీంతో వాహనాలను తనిఖీ చేస్తుండగా ఎర్రకుంటతండాకు చెందిన గుగులోత్ నెహ్రూ, వాంకుడోత్ తండాకు చెందిన వాంకుడోత్ హట్పి ద్విచక్ర వాహనంపై, ఆటోలో గుడుంబా ను తరలిస్తు పట్టుబడ్డారు. వారినుంచి 8 లీ టర్ల నాటుసారా, ఆటో, బైక్‌ను స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసి అరెస్టు చేసినట్లు తెలిపారు.కార్యక్రమంలో కానిస్టేబుల్ శ్రీని వా స్,దస్తగిరి, సలీం, డ్రైవర్ శ్రీనివాస్ ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment