సభ్యత్వ నమోదును పెంచాలి
బచ్చన్నపేట : భారతీయ జనతా పార్టీ సభ్యత్వ నమోదును పెంచాలని ఆ పార్టీ జిల్లా ఉపాధ్యక్షుడు బేజాడి బీరప్ప అన్నారు. ఆదివారం మండల కేంద్రంలో సభ్యత్వ నమోదు కార్యక్రమంలో పాల్గొన్న అనంతరం ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో అమలవుతున్న కేంద్ర సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షుడు చిమ్ముల నరేందర్‌రెడ్డి, నాయకులు సద్ది సోమిరెడ్డి, దొంతుల చంద్రమౌళి, కూరెళ్ల వెంకట్‌రెడ్డి, జూకంటి గణేష్, గద్ద రాజు, శీలంకోటి రాజు, రాంబాబు తదితరులు పాల్గొన్నారు.
బీజేపీ బలోపేతానికి కృషి చేయాలి
పాలకుర్తి టౌన్ : బూత్ స్థాయి నుంచి బీజేపీ బలోపేతానికి ప్రతి కార్యకర్త కృషి చేయాలని ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి, జిల్లా రిటర్నింగ్ ఇన్‌చార్జ్ డాక్టర్ వి.ప్రకాశరెడ్డి, జిల్లా అధ్యక్షుడు ఆరుట్ల దశమంతరెడ్డి అన్నారు. ఆదివారం మండల కేంద్రంలోనొ ఓ గార్డెన్‌లో బూత్ ఎన్నికల సమీక్ష సమవేశం నిర్వహించారు. వాజ్‌పేయి జన్మదినం సందర్భంగా సేవా దివస్ కార్యక్రమం చేపట్టాలన్నారు. జనగామ జిల్లాలో 250 బూత్ కమిటీలు వేసిట్లు తెలిపారు. ఈ సమావేశంలో బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి రాజశేఖర్, జిల్లా ఉపాధ్యక్షులు దొంగరి మహేందర్, మండల అధ్యక్షుడు దుంపల సంపత్, కడుదుల నిరంజన్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
బూత్ కమిటీల ఎన్నిక
జనగామ రూరల్ : బీజేపీ బలోపేతానికి ప్రతి కార్యకర్త కృషి చేయాలని మండల అధ్యక్షుడు మహేష్ అన్నారు. ఆదివారం మండలంలోని గానుగు పహాడ్ గ్రామంలో సంస్థాగత నిర్మాణంలో భాగంగా బూత్ నంబర్ 210 అధ్యక్షుడిగా కొడారి మహేందర్ 211 బూత్ అధ్యక్షుడిగా ఎడుమ రాజును ఎన్నుకున్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక బీజేపీ నాయకులు , కార్యకర్తలు తదితరులు ఉన్నారు.
బీజేపీ జిల్లా ఉపాధ్యక్షుడు బేజాడి బీరప్ప
Comments
Please login to add a commentAdd a comment