జిల్లా కోర్టు పీపీగా హరిశ్చంద్రప్రసాద్
దేవరుప్పుల: జిల్లా ప్రిన్సిపల్ సెషన్ కోర్టు పబ్లిక్ ప్రాసిక్యూటర్ (పీపీ)గా కాచరాజు హరిశ్చంద్రప్రసాద్‌ను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. దేవరుప్పుల మండలం సింగరాజుపల్లికి చెందిన ఆయన బార్ అసోసియేషన్ అధ్యక్షుడిగా, సబ్ కోర్టు పబ్లిక్ ప్రాసిక్యూటర్‌గా పనిచేశారు. జిల్లా కోర్టు పీపీగా నియామకం కావడంతో జిల్లా న్యాయవాదులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. తన నియామకానికి సహకరించిన డీసీసీ అధ్యక్షుడు కొమ్మూరి, ఎంపీ కిరణ్‌కుమార్‌రెడ్డి, ఎమ్మెల్యేలు కడియం శ్రీహరి, మామిడాల యశస్వినిరెడ్డిలకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు.
ఏజీపీగా చంద్రఋషి
జనగామ రూరల్: జిల్లా సీనియర్ సివిల్ జడ్జి కోర్టులో అసిస్టెంట్ ప్రభుత్వ ప్లీడర్ (ఏజీపీ)గా సీనియర్ న్యాయవాది ఎలగందుల చంద్రఋషిని నియమి స్తూ రాష్ట్ర ప్రభుత్వ లా సెక్రటరీ ఆర్. తిరుపతి ఉత్తర్వులు జారీ చేశారు. జనగామ కోర్టులో సీనియర్ న్యాయవాదిగా సేవలందిస్తున్న ఆయన ప్రస్తుతం స్థానిక బార్ అసోసియేషన్ అధ్యక్షుడిగా బాధ్యతలు నిర్వర్తిస్తూ న్యాయవాదుల సమస్యల పరిష్కారంతో పాటు జిల్లా కోర్టుకు సమన్వయంగా సేవలు అందిస్తున్నారు. ఈ సందర్భంగా చంద్ర ఋషి మాట్లాడుతూ ప్రభుత్వ పరంగా జిల్లా ప్రజలకు న్యాయ సేవలను అందిస్తానని, తన నియామకానికి సహకరించిన ప్రతీఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment