సంక్షిప్త సమాచారం
ప్రధాన అర్చకుడి మృతి
లింగాలఘణపురం/జనగామ రూరల్: మండలంలోని నెల్లుట్ల శివారు శ్రీనివాసనగర్‌కాలనీలో దాసాంజనేయ ఆలయ ప్రధాన అర్చకుడు శ్రీమాన్ అద్దంకి తాతాచార్యులు(64) అనారోగ్యంతో గురువారం మృతి చెందాడు. జిల్లాలోని పాలకుర్తి మండలం శాతాపురం గ్రామానికి చెందిన తాతాచార్యులు 20 ఏళ్లుగా శ్రీనివాసనగర్ కాలనీలో ఉంటూ జనగామ పట్టణంలోని ఏబీవీ జూనియర్ కళాశాలలో సంస్కృత అధ్యాపకులుగా పనిచేశారు. ఆయన మృతి పట్ల కళాశాల యాజమాన్యం సంజీవరెడ్డి, నర్సింహారావుతో పాటు శ్రీనివాసనగర్ కాలనీ అధ్యక్ష, కార్యదర్శులు నరేందర్‌రెడ్డి, శ్రీనివాసు ఉన్నారు.
మనస్తాపంతో యువకుడి ఆత్మహత్య
దేవరుప్పుల: తండ్రి ఆరోగ్య విషయమై కొడుకును మందలించినందుకు మనస్తాపం చెంది పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించి చికిత్స పొందుతూ మృతి చెందిన సంఘట మా దాపురంలో చోటుచేసుకుంది. ఎస్సై ఊర సృజన్‌కుమార్ కథనం ప్రకారం.. మండలంలోని మాదాపురానికి చెందిన చిలుకాని నవీన్ (23) వ్యవసాయ పనులు చేసుకుంటూ జీవిస్తున్నాడు. ఈ క్రమంలో అతనికి మూత్రవిసర్జన సమస్య రావడంతో తల్లిదండ్రులకు చెప్పకుండా జనగామలోని ఓ ఆస్పత్రిలో ఆపరేషన్ చేయించుకున్నాడు. ఈ విషయమై తండ్రి శ్రీను తనకు విషయం చెప్పకుండా గోప్యంగా ఆపరేషన్ చేసుకోవడంపై మందలించాడు. దీంతో ఈ నెల 24వ తేదీన నవీన్ మనస్తాపం చెంది పురుగుల మందు సేవించగా మెరుగైన చికిత్స కోసం వరంగల్ ఎంజీఎంకు తీసుకెళ్లారు. 25వ తేదీ రాత్రి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందగా తండ్రి ఫిర్యాదు మేరకు గురువారం కేసు నమోదు చేసినట్టు ఎసై పేర్కొన్నారు.
యువతి అదృశ్యం
జఫర్‌గఢ్: మండలంలోని లక్ష్మీనాయక్‌తండా గ్రామపంచాయితీ పరిధిలోని అర్‌సీ తండాకు చెందిన యువతి భూక్య అఖిల అచూకి లభించడం లేదంటూ తండ్రి యాకుబ్ స్థానిక పోలీస్ స్టేషన్‌లో గురువారం ఫిర్యాదు చేసినట్లు ఏఎస్సై వెంకటనారాయణ తెలిపారు. ఈసందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడుతూ ఈ నెల 23వ తేదీన కుటుంబ సభ్యులు ఇంట్లో లేని సమయంలో అఖిల ఇంటి నుంచి వెళ్లిపోవడం జరిగిందన్నారు. అప్పటి నుంచి ఆమె అచూకి కోసం కుటుంబ సభ్యులు వెతికినా లభించ లేదన్నారు. బాధిత కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఏఎసై తెలిపారు.
కేసు నమోదు
తరిగొప్పుల: ప్రభుత్వ నిషేధిత గుడుంబా తయారు చేసి విక్రయిస్తున్న మహిళపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై గుగులోతు శ్రీదేవి తెలిపారు. పోలీసు సిబ్బంది పెట్రోలింగ్ నిర్వహిస్తుండగా విశ్వసనీయ సమాచారం మేరకు మండలంలోని బొత్తలపర్రె గ్రామానికి చెందిన భూక్య సమ్మి ఇంటి వద్ద తనిఖీ చేపట్టగా నాలుగు లీటర్ల గుడుంబా పట్టుబడినట్లు తెలిపారు. గుడుంబా తయారు చేసి విక్రయిస్తున్న భూక్య సమ్మిపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు.
పరామర్శ
జనగామ: కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, బ్లాక్ కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు సర్వల నర్సింగ్‌రావు భార్య లలిత మృతి చెందగా గురువారం పలువురు నాయకులు పరామర్శించారు. డీసీసీ అధ్యక్షుడు కొమ్మూరి ప్రతాప్‌రెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ బనుక శివరాజ్‌యాదవ్, నాయకులు చెంచారపు శ్రీనివాస్‌రెడ్డి, డాక్టర్ రాజమౌళి, లింగాల నర్సిరెడ్డి, మహ్దేర్, సిద్దులు, బడికె ఇందిరా, కృష్ణ, స్వామి, మల్లారెడ్డి, శ్రీనివాస్, వేణు, సుధాకర్, భాస్కర్, ప్రకాశ్, పృథ్వీ, రఘు, అరవింద్ ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment