క్రీడాకారులకు దుస్తుల పంపిణీ
జనగామ రూరల్: రాష్ట్ర స్థాయి సీఎం కప్ పోటీలకు ఎంపికై న క్రీడాకారులకు జిల్లా అథ్లెటిక్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో అదనపు కలెక్టర్ రోహిత్‌సింగ్, పెద్ది వెంకటనారాయణగౌడ్ క్రీడా దుస్తులను గురువారం పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్ర స్థాయి పోటీల్లో ప్రతిభను కనబర్చి జాతీయ స్థాయి పోటీలకు ఎంపిక కావాలని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా యువజన, క్రీడల అధికారి వెంకటరెడ్డి, వ్యాయామ ఉపాధ్యాయ సంఘం సభ్యుడు మనోజ్‌కుమార్, హనుమంతరావు, ఆశోక్, కుమార్, చందర్, శ్రీనివాస్, రమాదేవి, దిలీప్‌కుమార్, నరేష్, రవి పాల్గొన్నారు.
ఏడునూతల గ్రామంలో..
కొడకండ్ల: ప్రస్తుత చలి తీవ్రతకు ఉపయుక్తంగా గ్రామస్తులకు తనవంతు సహాయంగా హైదరాబాద్‌లో నివాసం ఉంటున్న రాంపల్లి శ్రీనివాస్ దుప్పట్లను పంపిణీ చేశారు. ఏడునూతుల గ్రామానికి చెందిన ఆయన గ్రామస్తులకు చేయూతనివ్వాలనే సంకల్పంతో సోలాపూర్ నుంచి 1,200 దుప్పట్లను కొనుగోలు చేసి కులమతాలకు అతీతంగా గ్రామస్తులతో పాటు తండా గిరిజనులకు పంపిణీ చేశారు. మాజీ వైస్ ఎంపీపీ వీరసోములు, బ్రహ్మచారి, ఎలికట్టే సోమన్న, పాపయ్య, లింగయ్య తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment