ఎన్నిక
జఫర్‌గఢ్: మండలంలోని ఓబులాపూర్ గ్రామానికి చెందిన గబ్బెట మోహన్ ఏబీవీపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడిగా గురువారం ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. సిద్దిపేటలో ఈ నెల 23, 24, 25 తేదీల్లో జరిగిన ఏబీవీపీ రాష్ట్ర కార్యవర్గ సమావేశాల్లో నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడుతూ రానున్న రోజుల్లో విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలపై పోరాటాలు నిర్వహించనున్నట్లు ఆయన తెలిపారు.
బూత్ అధ్యక్షుడి..
జనగామ: పట్టణంలోని 27వ వార్డులో 257 పోలింగ్ బూత్ అధ్యక్షుడిగా లగిషెట్టి వీరలింగం ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బీజేపీ అభివృద్ధికి తనవంతు కృషి చేస్తానని తెలిపారు. మున్సిపల్ ఫ్లోర్ లీడర్ మహంకాళి హరిశ్చంద్రగుప్త, నాయకులు సౌడ రమేష్, అనిల్‌గౌడ్, గణపుకం కార్తీక్, లగిషెట్టి వెంకటేశ్వర్లు, చెంద్రయ్య, అజయ్, సత్యం తదితరులు పాల్గొన్నారు.
ది జనగామ లారీ ఓనర్స్
అసోసియేషన్ నూతన కమిటీ
జనగామ రూరల్: వ్యవసాయ మార్కెట్లోని ది జనగామ లారీ ఓవర్ అసోసియేషన్ నూతన కమిటీని గురువారం ఎన్నుకున్నారు. కమిటీ అధ్యక్షుడిగా ఎంఏ కాలిద్, ప్రధాన కార్యదర్శిగా ఎన్.రాజశేఖర్, కోశాధికారిగా శ్రీశైలం ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా కాలిద్ మాట్లాడుతూ లారీ ఓనర్ల సమస్యల పరిష్కారానికి నూతన కమిటీ కృషి చేస్తుందన్నారు. జి.నరేందర్, ఎండీ.రఫీక్, ఎండీ.జహంగీర్, ఎండీ అంజాద్, యూసుఫ్ ఖాన్, సతీష్, సంపత్ కుమార్, రషీద్, రజాక్ తదితరులు పాల్గొన్నారు.
సత్కారం
జనగామ: మండలంలోని ఎల్లంల గ్రామానికి చెందిన పాస్టర్ బక్క ఏలియా ఇటీవల రాష్ట్ర గవర్నెన్స్ వింగ్ ఉపాధ్యక్షుడిగా నియమితులయ్యారు. కాగా, గురువారం స్వగ్రామంలో సహచర మిత్రులు ఘనంగా ఆయనను సత్కరించారు. ప్రస్తుతం ఆయన హైదరాబాద్‌లోని గౌతంనగర్ డివిజన్ ఇందిరానెహ్రూనగర్‌లోని హిల్ చర్చి పాస్టర్‌గా కొనసాగుతున్నారు. ఎల్లంలకు చెందిన ఏలియాకు ఇంతటి కీర్తి రావడం సంతోషంగా ఉందని వారు అన్నారు.
అరెస్టు సరికాదు
జనగామ రూరల్: బీఆర్‌ఎస్ నాయకుడు, ఎస్సీ, ఎస్టీ కమిషన్ మాజీ చైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్‌ను అరెస్టు చేయడం సరికాదని బీఆర్‌ఎస్‌వీ జిల్లా కోఆర్డినేటర్ రావుల తిరుమల్‌రెడ్డి అన్నారు. జిల్లా కేంద్రంలో గురువారం ఆయన విలేకరులతో మాట్లాడారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం బీఆర్‌ఎస్ నాయకులపై కక్షసాధింపు చర్యలకు పాల్పడుతుందన్నారు. తక్షణమే శ్రీనివాస్‌ను విడుదల చేయాలని ఆయన డిమాండ్ చేశారు.
యాదగిరిగుట్ట గిరిప్రదక్షిణకు తరలిన భక్తులు
జనగామ: ప్రముఖ పుణ్యక్షేత్రం యాదగిరిగుట్టలో స్వామివారి స్వాతి నక్షత్రం పురస్కరించుకుని గురువారం జరిగిన గిరిప్రదక్షిణకు జిల్లా నుంచి వందలాది మంది భక్తులు తరలివెళ్లారు. ప్రదక్షిణ అనంతరం, మెట్ల మార్గాన కొండపైకి వెళ్లి స్వామిని దర్శించుకున్నారు. కాగా శివరామకృష్ణ భజన మండలికి చెందిన ప్రతినిధి సిద్దేశ్వర్ ఆధ్వర్యంలో భక్తులు తరలి వెళ్లి సంకీర్తనలు, భజనలు చేశారు.
లక్ష్మీనర్సింహస్వామి కొండ చుట్టూ..
జఫర్‌గఢ్: మండల కేంద్రంలో ఉన్న వేల్పుగొండపై వెలసిన లక్ష్మీనర్సింహస్వామి కొండ చుట్టూ భక్తులు, గ్రామస్తులు భక్తిశ్రద్ధలతో గిరిప్రదక్షిణ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment