ప్రజాసమస్యలపై నిరంతర పోరాటం
● సీపీఐ జిల్లా కార్యదర్శి రాజారెడ్డి
జనగామ రూరల్: ప్రజాసమస్యలపై తమ పార్టీ నిరంతరం పోరాటం చేస్తోందని సీపీఐ జిల్లా కార్యదర్శి, మాజీ ఎమ్మెల్యే రాజారెడ్డి పేర్కొన్నారు. పార్టీ స్థాపించి 99 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా జిల్లా కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో రాజారెడ్డి.. పార్టీ జెండాను గురువారం ఎగురవేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పార్టీ ఆవిర్భవించిన నాటి నుంచి నేటి వరకు శ్రమజీవుల హక్కులతోపాటు ప్రజా సమస్యలపై నిరంతరం పోరాటాన్ని సాగిస్తున్నట్లు తెలిపారు. తమ పోరాటాల ఫలితంగా అనేక సమస్యలు పరిష్కారమైనట్లు చెప్పారు. ముఖ్యంగా ప్రభుత్వాలు అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపై అలుపెరగని పోరాటాన్ని సాగిస్తున్నట్లు తెలిపారు. ఎర్రజెండా ద్వారానే పేదలకు న్యాయం జరుగుతుందని అభిప్రాయపడ్డారు. పార్టీ ఆవిర్భవించి వంద సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా గ్రామ గ్రామాన జెండాలు ఆవిష్కరించడం జరుగుతున్నదన్నారు. కార్యక్రమంలో పార్టీ జిల్లా నాయకులు ఆకుల శ్రీనివాస్, సొప్పరి సోమయ్య, మోటే శ్రీశైలం, యాకుబ్, అరుణ, గుర్రం మధు, గూగుల్ సఖి, ఐలయ్య, నగేశ్, సుదర్శన్ తదితరులు పాల్గొన్నారు.
పేదల పక్షపాతి సీపీఐ
స్టేషన్‌ఘన్‌పూర్: ీసపీఐ పార్టీ ఆవిర్భావం నుంచి పేద ప్రజల పక్షపాతిగా పనిచేస్తుందని పార్టీ జిల్లా కౌన్సిల్ సభ్యుడు ఎండీ.యూనుస్, మండల కార్యదర్శి సముద్రాల రాజు అన్నారు. సీపీఐ ఆవిర్భావ దినోత్సవ కార్యక్రమాన్ని ఘన్‌పూర్ డివిజన్ కేంద్రంలో గురువారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథులుగా హాజరైన వారు ముందుగా పార్టీ జెండాను ఆవిష్కరించారు. అనంతరం వారు మాట్లాడారు. సీపీఐ పార్టీ మొదటి నుంచి కార్మిక, కర్షక వర్గాలకు అండగా ఉంటూ ఎన్నో పోరాటాలు చేసిందని, దేశ స్వాతంత్య్ర ఉద్యమంలో సీపీఐ కీలకంగా పనిచేసిందన్నారు. తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో పాల్గొని భూస్వాములకు వ్యతికరేకంగా పేద రైతుల నిలిచి సీపీఐ పోరాటాలు చేసిందన్నారు. సీపీఐ పార్టీ ఆవిర్భవించి 99 సంవత్సరాలు పూర్తయి వందేళ్లలోకి అడుగిడిందని, అనునిత్యం పేద ప్రజలు, కార్మికులు, కర్షకుల పక్షపాతిగా ప్రజాపోరాటాలు నిర్వహిస్తామన్నారు. పార్టీ నాయకులు ఆశీర్వాదం, తోట రమేష్, పొన్న సాయిలు, నాగరాజు పాల్గొన్నారు.
చిల్పూరులో..
చిల్పూరు: సీపీఐ ఆవిర్భావ దినోత్సవాన్ని మండలంలో నిర్వహించారు. ఈ సందర్భంగా మండల కేంద్రంలో మండల కార్యదర్శి బోనగిరి కుమారస్వామి పార్టీ జెండాను ఎగురవేసి స్వీట్లు పంపిణీ చేశారు. కార్యక్రమంలో కట్ట ఎల్లయ్య, పిట్టల కుమారస్వామి, రచ్చ వెంకటయ్య, వంగ చంద్రమౌళి, మోతె వెంకటయ్య, కార్యకర్తలు హాజరయ్యారు.
పేదలకు అండగా సీపీఐ
బచ్చన్నపేట: భారత కమ్యునిష్టు పార్టీ పేదలకు అండగా నిలుస్తుందని ఆ పార్టీ మండల కార్యదర్శి బంటు పాండు అన్నారు. పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా మండల కేంద్రంలోని ప్రధాన చౌరస్తాలో జెండావిష్కరణ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment