కేంద్ర పథకాలను సద్వినియోగం చేసుకోండి
పద్మశాలి సంఘం నాయకుడు దామోదర్
చిల్పూరు: కేంద్రం నుంచి వచ్చే పథకాలను నిరుద్యోగ యువత సద్వినియోగం చేసుకోవాలని పద్మశాలి సంఘం రాష్ట్ర నాయకుడు, మండల అధ్యక్షుడు గజ్జెల దామోదర్ అన్నారు. మండల కేంద్రంలోని చిల్పూరుగుట్ట సమీపంలో ప్రధాన మంత్రి ఫార్మలేషన్ ఆఫ్ మైక్రో ఫుడ్ ప్రాసెసింగ్ ఎంటర్‌ప్రైజెస్ స్కీం ద్వారా మండలంలోని మల్కాపూర్ గ్రామానికి చెందిన బండారి రాజేష్‌కు రూ. 18 లక్షలు మంజూరు కాగా గురువారం మహేశ్వర ఎంటర్ ప్రైజెస్‌ను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా పలు సూచనలు చేశారు. కార్యక్రమంలో బండారి రాజ్‌కుమార్, పోలేపల్లి రంజిత్‌రెడ్డి, విక్రం, నరేష్, శేఖర్, రాజయ్య, భూషణ్, రాజశేఖర్, రాజేశ్వర్, గడ్డం శంకర్, శ్రీకాంత్ పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment