ఇందిరమ్మ ఇళ్ల సర్వే పరిశీలన | - | Sakshi
Sakshi News home page

ఇందిరమ్మ ఇళ్ల సర్వే పరిశీలన

Published Sun, Dec 29 2024 1:34 AM | Last Updated on Sun, Dec 29 2024 1:34 AM

ఇందిర

ఇందిరమ్మ ఇళ్ల సర్వే పరిశీలన

పాలకుర్తి టౌన్‌: మండల కేంద్రంలో ఇందిరమ్మ ఇళ్ల సర్వే ప్రక్రియను శనివారం అడిషనల్‌ కలెక్టర్‌ పింకేష్‌కుమార్‌ పరిశీలించారు. అంతకుమందు ఎంపీడీఓ కార్యాలయంలో గ్రామ పంచాయతీ కార్యదర్శులతో జూమ్‌ మీటింగ్‌ నిర్వహించారు. ఇందిరమ్మ ఇళ్ల సర్వే త్వరగా పూర్తి చేయాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో డీఆర్‌డీఏ పీడీ, మండల ప్రత్యేక అధికారి వసంత, ఎంపీడీఓ రాములు, హౌసింగ్‌ డీఈ సాయిరాంరెడ్డి, ఎంపీఓ రవీందర్‌ పాల్గొన్నారు.

పోరాటాలతోనే సమస్యల పరిష్కారం

సీపీఎం కేంద్ర కమిటీ సభ్యుడు నాగయ్య

స్టేషన్‌ఘన్‌పూర్‌: ప్రజాపోరాటాలతోనే సమస్యల పరి ష్కారం సాధ్యమని సీపీఎం కేంద్ర కమిటీ సభ్యుడు జి.నాగయ్య అన్నారు. ఘన్‌పూర్‌ డివిజన్‌కేంద్రంలో జరుగుతున్న జిల్లా మహాసభల్లో శనివారం రెండవ రోజు రాపర్తి రాజు అధ్యక్షతన జరిగిన సమావేశంలో నాగయ్య పాల్గొని మాట్లాడారు. దేశంలో బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఉపాధి హామీ పథకానికి నిధులు కేటాయించకుండా నీరుగారుస్తుందన్నారు. కేంద్ర ప్రభుత్వం స్పందించి రైతాంగానికి స్వామినాథన్‌ కమిషన్‌ ప్రకారం గిట్టుబాటు ధరలను అమలు చేయాలని, ఫసల్‌బీమా యోజన రైతులకు అనుకూలంగా మార్చాలని, రైతాంగ రక్షణ కోసం దేశవ్యాప్తంగా రుణవిమోచన చట్టం తీసుకురావాలని డిమాండ్‌ చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు ఎండీ.అబ్బాస్‌, జిల్లా కార్యదర్శి మోకు కనకారెడ్డి, నాయకులు రాపర్తి రాజు, ఇర్రి అహల్య, బూడిద గోపి, మునిగెల రమేష్‌, రాపర్తి సోమయ్య, రమేష్‌, సాంబరాజు, యాదగిరి, శేఖర్‌, చందునాయక్‌, విజేందర్‌, ధర్మబిక్షం, సురేష్‌నాయక్‌, వెంకటేష్‌, యాకయ్య, సోమన్న పాల్గొన్నారు.

శబరిమలకు ఆర్టీసీ బస్సు

జనగామ: జనగామ డిపోకు చెందిన డిలక్స్‌ బస్సు శబరి మల యాత్రకు బయలు దేరగా, ఆర్టీసీ మేనేజర్‌ ఎస్‌.స్వాతి శనివారం జెండా ఊపి ప్రారంభించారు. రఘునాథపల్లి మండలం కంచనపల్లికి చెందిన 40 మంది అయ్యప్ప స్వాములు డిలక్స్‌ బస్సులో శబరిమలకు వెళ్లారు. ఈ సందర్భంగా డీఎం మాట్లాడుతూ కంచనపల్లి నుంచి కాణిపాకం, భావాని, పళని, గురువాయర్‌, చోటనిక్కర్‌, ఎరుమేలి మీదుగా పంబ(శబరిమలై) పుణ్యక్షేత్రానికి చేరుకుంటుందన్నారు. అక్కడ దైవదర్శన అనంతరం త్రివేండ్రం, కన్యాకుమారి, రామేశ్వరం, మదురై, శ్రీరంగం, అరుణాచలం, శ్రీకాళహస్తి క్షేత్రాల మీదుగా వచ్చే నెల 4వ తేదీన జనగామకు చేరుకుంటుందన్నారు. అయ్యప్ప స్వాములు శబరిమళ యాత్రకు ఆర్టీసీ సేవలను సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో అసిస్టెంట్‌ మేనేజర్‌(ట్రాఫిక్‌), డి.హుస్సేన్‌, అసిస్టెంట్‌ ఇంజినీర్‌ (మెకానిక్‌) జి.రాఘవేందర్‌, ఆఫీస్‌ సూపరింటెండెంట్‌ వై.యాదమణిరావు, ఎస్‌ఎం ఎం.సమ్మయ్య, సెక్యూరిటీ హెడ్‌ కానిస్టేబుల్‌ వి.ప్రభాకర్‌, ఉద్యోగులు ఉన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
ఇందిరమ్మ ఇళ్ల సర్వే పరిశీలన1
1/2

ఇందిరమ్మ ఇళ్ల సర్వే పరిశీలన

ఇందిరమ్మ ఇళ్ల సర్వే పరిశీలన2
2/2

ఇందిరమ్మ ఇళ్ల సర్వే పరిశీలన

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement