సోమేశ్వరస్వామికి పూర్ణకుంభం చెంబు బహూకరణ | - | Sakshi
Sakshi News home page

సోమేశ్వరస్వామికి పూర్ణకుంభం చెంబు బహూకరణ

Published Mon, Feb 10 2025 1:41 AM | Last Updated on Mon, Feb 10 2025 1:41 AM

సోమేశ

సోమేశ్వరస్వామికి పూర్ణకుంభం చెంబు బహూకరణ

పాలకుర్తి టౌన్‌: శ్రీసోమేశ్వర లక్ష్మీనర్సింహస్వామివారి ఆలయంలో పూర్ణకుంభంకు ఉపయోగించడానికి ఆలయ అర్చకుడు మత్తగజం నాగరాజు సూచన మేరకు హనుమకొండకు చెందిన వేముల వీరభద్రం, కల్యాణి దంపతులు, దీక్షిత, హర్షిణి కుటుంబసభ్యులు స్వామివారికి రూ.50 వేల విలువైన అరకిలో వెండి చెంబును ఆలయానికి బహూకరించినట్లు ఆలయ ఈఓ సల్వాది మోహన్‌బాబు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ సూపరింటెండెంట్‌ కొత్తపల్లి వెంకటయ్య, అర్చకులు డీవీఆర్‌శర్మ, దేవగిరి అనిల్‌కుమార్‌, ఆలయ సిబ్బంది, భక్తులు పాల్గొన్నారు.

రిటైర్డ్‌ ఉద్యోగుల పెన్షన్‌ మంజూరు చేయాలి

చిల్పూరు: రిటైర్డ్‌ ఉద్యోగుల పెన్షన్‌ మంజూరు విషయంలో సీఎం రేవంత్‌రెడ్డి సమీక్ష నిర్వహించి ఎప్పుడు అందజేస్తారో ప్రకటించాలని రి టైర్డ్‌ ఉద్యోగుల ఉమ్మడి వరంగల్‌ జిల్లా అధ్యక్షుడు ఇనుగాల ఇంద్రసేనారెడ్డి తెలిపారు. ఆది వారం ఆయన మాట్లాడుతూ 2024 నుంచి ఇ ప్పటి వరకు ఉద్యోగ విరమణ చేసిన వారిలో కమీషన్లు, కోర్టుకు వెళ్లిన వారికి మాత్రమే పె న్షన్‌ మంజూరు చేశారన్నారు. మిగతా వారికి ఇంతవరకు పెన్షన్‌ అందకపోవడంతో మనోవేదన చెందుతున్నారన్నారు. ఇప్పటికై న తమను గుర్తించి న్యాయం చేయాలని కోరారు.

ప్రజావాణి కార్యక్రమం తాత్కాలికంగా వాయిదా

జనగామ రూరల్‌: ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రతీ సోమవారం కలెక్టరేట్‌, మండల తహసీల్దార్‌ కార్యాలయాల్లో నిర్వహించే ప్రజావాణి కార్యక్రమాన్ని తాత్కాలికంగా వాయిదా వేస్తున్నట్లు కలెక్టర్‌ రిజ్వాన్‌ బాషా ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. శాసనమండలి ఎన్నికల ప్రవర్తన నియమావళి అమలులో ఉండడం, గ్రామ పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో సంబంధిత అధికారులకు ఎన్నికల విధుల నిర్వహణపై ముందస్తు శిక్షణ కార్యక్రమాలను ఏర్పాటు చేస్తున్నందున ప్రజావాణి కార్యక్రమాన్ని తాత్కాలికంగా వాయిదా వేస్తున్నట్లు తెలిపారు. ప్రజలు ఈ విషయాన్ని గమనించి, వినతులు ఇచ్చేందుకు కలెక్టరేట్‌కు రావొద్దని సూచించారు. ఎన్నికల ప్రక్రియ ముగిసిన అనంతరం కార్యక్రమాన్ని యథా విధిగా నిర్వహిస్తామన్నారు.

కొనసాగుతున్న ఇంటర్‌ ప్రాక్టికల్స్‌

జనగామ రూరల్‌: ఇంటర్‌ ప్రాక్టికల్‌ పరీక్షలు ప్రశాంతంగా కొనసాగుతున్నాయని డీఐఈఓ జితేందర్‌రెడ్డి తెలిపారు. ఆదివారం మొదటి సెషన్‌లో జనరల్‌ 201 విద్యార్థులు గాను 197 మంది, రెండవ సెషన్‌లో జనరల్‌, ఒకేషనల్‌ విద్యార్థులు 262 విద్యార్థులకు గాను 255 మంది హాజరైనట్లు తెలిపారు. డీఐఈఓ జితేందర్‌రెడ్డి జనగామలోని పలు పరీక్ష కేంద్రాలను సందర్శించారు. జిల్లా పరీక్ష నియంత్రణ అధికారులు ఎస్‌. శ్రీనివాస్‌, వి.శేఖర్‌ స్టేషన్‌ఘన్‌పూర్‌ కరుణాపురం, జఫర్‌గఢ్‌ పరీక్ష కేంద్రాలను సందర్శించారు.

జాతీయస్థాయి కరాటే పోటీల్లో ప్రతిభ

స్టేషన్‌ఘన్‌పూర్‌: న్యూడ్రాగన్‌ మార్షల్‌ ఆర్ట్స్‌ ఆధ్వర్యంలో ఆదివారం హైదరాబాద్‌ సరూర్‌నగర్‌ ఇండోర్‌ స్టేడియంలో జరిగిన జాతీయస్థాయి కరాటే పోటీల్లో స్టేషన్‌ఘన్‌పూర్‌, తాటికొండ, ఛాగల్లు ప్రభుత్వ ఉన్నత పాఠశాలలకు చెందిన 13 మంది విద్యార్థులు ఉత్తమ ప్రతిభను ప్రదర్శించి ఓవరాల్‌ చాంపియన్‌షిప్‌ను కై వసం చేసుకున్నారని కరాటే మాస్టర్లు పెసరు సారయ్య, వంగ శ్రీనివాస్‌, రజాక్‌, జావీద్‌ తెలిపారు. ఈ పోటీల్లో అండర్‌ 14, 12, 10 విభాగాల్లో పాల్గొన్న ఆయా పాఠశాలల విద్యార్థులు ప్రతిభను చాటారన్నారు. ముఖ్య అతిథులుగా పాల్గొన్న థాయిలాండ్‌కు చెందిన గ్రాండ్‌ మాస్టర్‌ ప్రేమ్‌చందర్‌సింగ్‌, సినీ హీరో భానుచందర్‌ చేతులమీదుగా బహుమతులు అందుకున్నారన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
సోమేశ్వరస్వామికి పూర్ణకుంభం చెంబు బహూకరణ1
1/3

సోమేశ్వరస్వామికి పూర్ణకుంభం చెంబు బహూకరణ

సోమేశ్వరస్వామికి పూర్ణకుంభం చెంబు బహూకరణ2
2/3

సోమేశ్వరస్వామికి పూర్ణకుంభం చెంబు బహూకరణ

సోమేశ్వరస్వామికి పూర్ణకుంభం చెంబు బహూకరణ3
3/3

సోమేశ్వరస్వామికి పూర్ణకుంభం చెంబు బహూకరణ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement