![కడియంను విమర్శించే స్థాయి పోచంపల్లికి లేదు](https://www.sakshi.com/styles/webp/s3/article_images/2025/02/10/09stg051-330009_mr-1739131454-0.jpg.webp?itok=k4uLAjm2)
కడియంను విమర్శించే స్థాయి పోచంపల్లికి లేదు
స్టేషన్‌ఘన్‌పూర్: అభివృద్ధే లక్ష్యంగా పనిచేస్తున్న స్థానిక ఎమ్మెల్యే కడియం శ్రీహరిని విమర్శించే స్థాయి, నైతిక హక్కు ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డికి లేదని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకుడు, రైస్ మిల్లర్ల అసోసియేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు బెలిదె వెంకన్నగుప్తా అన్నారు. ఘన్‌పూర్ డివిజన్‌కేంద్రంలో ఆదివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎమ్మెల్సీ పోచంపల్లి తన స్థాయిని విస్మరించి సీఎం రేవంత్‌రెడ్డిని, ఎమ్మెల్యే కడియం శ్రీహరిని విమర్శించడం తగదన్నారు. ఎన్నికల ముందు ప్రజలకు ఇచ్చిన హామీలకు కట్టుబడి నియోజకవర్గ అభివృద్ధే లక్ష్యంగా కడియం శ్రీహరి కాంగ్రెస్ పార్టీలోకి వచ్చారన్న విషయం ప్రజలందరికీ తెలిసిందేనన్నారు. మాజీ ఎమ్మెల్యే రాజయ్య చరిత్ర ప్రజలందరికీ విధితమేనని, అతడితో కలిసి విమర్శలు చేయడం సిగ్గుచేటన్నారు. మరోసారి కడియంపై విమర్శలు చేస్తే సహించేది లేదన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ జిల్లా నాయకులు తోట వెంకన్న, దైద ఎలిషన్, దుంపల పద్మారెడ్డి, మంతెన ఇంద్రారెడ్డి, ఆకుల కృష్ణంరాజు తదితరులు పాల్గొన్నారు.
కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకుడు బెలిదె వెంకన్నగుప్తా
Comments
Please login to add a commentAdd a comment