దరఖాస్తుల స్వీకరణ
భూపాలపల్లి అర్బన్: జిల్లాలోని కస్తూర్బాగాంధీ, మోడల్ స్కూళ్లలో ఖాళీగా ఉన్న టీచింగ్, నాన్ టీచింగ్ పోస్టులను కాంట్రాక్ట్, అవుట్ సోర్సింగ్ పద్ధతిలో భర్తీ చేసేందుకు దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు జిల్లా ఇన్‌చార్జ్ విద్యాశాఖ అధికారి రాజేందర్ గురువారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. భూపాలపల్లి, కాటారం కేజీబీవీల్లో అకౌంటెంట్, కాటారం మోడల్ స్కూల్‌లో మెసెంజర్, అకౌంటెంట్, మహాముత్తారం కేజీబీవీలో అటెండర్, మల్హర్, మహాముత్తారం కేజీవీబీలో వాచ్ ఉమెచ్, కాటారం, రేగొండలో స్వీపర్, స్కావెంజర్, గణపురం, పలిమెల, రేగొండ కేజీబీవీల్లో అసిస్టెంట్ కుక్ హెల్పెర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయని వాటిని భర్తీ చేయనున్నట్లు తెలిపారు. ఈ నెల 18నుంచి 23వ తేదీ వరకు సంబంధిత కేజీబీవీల్లో దరఖాస్తు అందజేయాలని సూచించారు. స్థానికులు మాత్రమే అర్హులని తెలిపారు. ఇతర వివరాలకు 94419 24901, 90009 96933 ఫోన్ నంబర్‌లను సంప్రదించాలని సూచించారు.
గడువు పొడిగింపు
భూపాలపల్లి అర్బన్: పారా మెడికల్ కోర్సుల ప్రవేశాల దరఖాస్తు గడుపును ఈ నెల 20వ తేదీ వరకు పొడిగించినట్లు స్థానిక ప్రభుత్వ మెడికల్ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ రాజేంద్రప్రసాద్ గురువారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. డీఎంఎల్‌టీ, డీఈసీజీ పారా మెడికల్ కోర్సులపై ఆసక్తిగల అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.
బొగ్గు నాణ్యతా
వారోత్సవాలు ప్రారంభం
భూపాలపల్లి అర్బన్: బొగ్గు నాణ్యతా వారోత్సవాలను గురువారం ఏరియాలోని సింగరేణి జనరల్ మేనేజర్ కార్యాలయంలో ఘనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో భాగంగా జీఎం కార్యాలయంలో ఇన్‌చార్జ్ జీఎం వెంకటరామరెడ్డి హాజరై క్యాలిటీ పతకావిష్కరణ చేపట్టారు. నాణ్యతే ప్రగతికి ప్రామాణికమని దాని పరిరక్షణ అందరి బాధ్యతని వెంకటరామరెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమంలో అధికారులు కవీంద్ర, జోతి, రవికుమార్, సురేఖ, కార్మిక సంఘాల నాయకులు రమేష్, వేణుగోపాల్ పాల్గొన్నారు.
మహాలక్ష్మికి చేయూత
టేకుమట్ల: మండలంలోని రాఘవాపూర్ గ్రామంలో నిరుపేద కుటుంబానికి చెందిన ఆటోడ్రైవర్ దండ్రె రమేష్ కూతురు మహాలక్ష్మి లివర్ సంబంధిత వ్యాధితో కొన్ని రోజులుగా హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతుంది. రమేష్ బాల్య మిత్రులకు ఎన్‌ఆర్‌ఐ దంపతులు కాసర్ల ప్రసన్న–వినయ్‌రెడ్డి రూ.2లక్షలు అందించి వారి దాతృత్వాన్ని చాటుకున్నారు. మహాలక్ష్మి వైద్య ఖర్చుల కోసం అవసరమైతే మరింత ఆర్థిక సాయాన్ని అందిస్తామని భరోసా కల్పించారు. దాంతో ఎన్‌ఆర్‌ఐ దంపతులు అందించిన నగదును మిత్రబృందం గురువారం మహాలక్ష్మి తండ్రి రమేష్‌కు అందించారు.
వ్యాధులను నివారించాలి
భూపాలపల్లి అర్బన్: పశువుల్లో గర్భకోశ, సీజనల్ వ్యాధులను గుర్తించి నివారించాలని జిల్లా పశు వైద్యాధికారి డాక్టర్ ఎ.కుమారప్వామి తెలిపారు. మండలంలోని పెద్దపూర్, పెరుకపల్లి గ్రామాల్లో గురువారం ఉచిత పశు వైద్యశిబిరం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గాలికుంటు వ్యాధి టీకాల ప్రాముఖ్యతను వివరించారు. ఈ కార్యక్రమంలో పశువైద్యాధికారి డాక్టర్ తిరుపతి, గోపాలమిత్రలు, సిబ్బంది పాల్గొన్నారు.
ఉద్యోగుల జోలికొస్తే ఊరుకోం
భూపాలపల్లి: ప్రభుత్వ ఉద్యోగుల జోలికి ఎవరు వచ్చినా ఊరుకునేది లేదని టీఈ జేఏసీ జిల్లా చైర్మన్ బూరుగు రవి అన్నారు. వికారాబాద్ జిల్లా లగచర్లలో కలెక్టర్, ఉద్యోగులపై దాడిని నిరసిస్తూ జేఏసీ ఆధ్వర్యంలో కలెక్టరేట్‌లోని ఉద్యోగులు భోజన విరామ సమయంలో నల్ల బ్యాడ్జీలు ధరించి కలెక్టరేట్ భవనం ఎదుట నిరసన చేపట్టారు. ఈ కార్యక్రమంలో టీఎన్జీఓస్, డీటీఎఫ్, యూటీఎఫ్, రెవెన్యూ సంఘం జిల్లా నాయకులు మార్క రామ్మోహన్, గోవర్ధన్, షఫీ అహ్మద్, దశరధ రామారావు తదితరులు పాల్గొన్నారు. అనంతరం తెలంగాణ ఉద్యోగుల జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో కలెక్టరేట్ ఎదుట నిరసన చేపట్టారు. ఈ కార్యక్రమంలో సంఘం నాయకులు ఇనుగాల క్రిష్ణమూర్తి, శ్రీనివాస్, చంద్రమోహన్, లక్ష్మీనారాయణ పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment