వీడుతున్న మత్తు
కాటారం: గుడుంబా, నాటు సారా తయారీదారులకు కంచుకోటలుగా నిలిచిన అటవీ పల్లెలు మార్పు బాటలో పయనిస్తున్నాయి. కొన్నేళ్లుగా గుడుంబా తయారే ప్రధాన జీవనాధారంగా కొనసాగుతూ వస్తున్న పల్లెలు ప్రస్తుతం గుడుంబా తయారీ అంటేనే జంకుతున్నాయి. ఎన్ని క్లిష్టపరిస్థితులు వచ్చినా గుడుంబా తయారీని వదలని పల్లెల్లోని పలు కుటుంబాలు తమ అసాంఘిక వృత్తిని వదిలి ఉపాధిని కోరుకుంటున్నాయి. గుడుంబా మహమ్మారితో అతలాకుతలమైన పల్లెలు.. ఎకై ్సజ్ అధికారుల దాడులు.. పోలీసుల అవగాహన సదస్సులతో మార్పు దిశగా వెళ్తున్నాయి.
అసాంఘిక కార్యకలాపాల అడ్డాలుగా..
పచ్చదనంతో ఆహ్లాదంగా ఉండే పల్లెలు గుడుంబా తయారీతో అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాలుగా మారిపోయాయి. మండలంలోని గట్లకుంట, గంగారం, విలాసాగర్, దామెరకుంట, శంకరాంపల్లి, కొత్తపల్లి, అంకుషాపూర్, మేడిపల్లి, మహాముత్తారం మండలం బోర్లగూడెం, సింగారం, యామన్‌పల్లి, కనుకునూరు, మహదేవపూర్ మండలం బొమ్మాపూర్, కుదురుపల్లి, పల్గుల, అంబట్‌పల్లి, సూరారం, రాపెల్లికోట, మల్హర్ మండలం గాదెంపల్లి, రుద్రారం, పెద్దతూండ్ల, మల్లారం, కొయ్యూర్, ఎడ్లపల్లి, పలిమెల మండలం పలిమెల, పంకెన, సర్వాయిపేట, నీలంపల్లి, మోదేడు, లెంకలగడ్డ, పెద్దంపేట గ్రామాల్లో విచ్చలవిడిగా గుడాంబా తయారీ జరిగేది. ఇదంతా గత కొన్ని నెలల క్రితం జరిగిన తతంగం. కానీ, ప్రస్తుత పరిస్థితులు అందుకు భిన్నంగా మారిపోయాయి. ప్రభుత్వం గుడాంబా తయారీపై ఉక్కు పాదం మోపుతుండడంతో తయారీదారులకు నిర్వాహణ కత్తిమీద సా ములా మారిపోయింది. గుడాంబా నిషేధం పకడ్బ ందీగా అమలు చేయాలని ప్రభుత్వం కేవలం ఎౖక్సై జ్ శాఖకే కాకుండా పోలీస్‌శాఖ, ఇతరాత్ర పలు శా ఖలకు ఆదేశాలు జారీ చేయడంతో పల్లెల్లో గుడుంబా తయారీ తగ్గుముఖం పడుతుంది. ఎక్సైజ్ శా ఖ, పోలీస్ శాఖ దాడులు చేయడంతోపాటు కేసులు నమోదు చేస్తుండటంతో తయారీకి జంకుతున్నారు.
ఉపాధి కల్పించాలని వేడుకోలు..
కొన్నేళ్లుగా గుడుంబాపైనే ఆధారపడి జీవనం సాగించిన పలు గ్రామాల్లోని కుటుంబాలు ప్రస్తు తం ఆ వృత్తిని వీడి ఉపాధి వైపు అడుగులు వేస్తున్నాయి. గత ప్రభుత్వం జిల్లాలోని పలువురు గు డుంబా తయారీదారులకు గొర్రెలు, గేదెల పంపి ణీ, ట్రాన్స్‌పోర్టు వాహనాల కొనుగోలు లాంటి వా టి కోసం ఎకై ్సజ్ శాఖ ద్వారా రుణాలు అందజేసింది. దీంతో గ్రామాల్లోని అధిక శాతం తయారీదారులు గుడుంబా తయారీని వదిలేసి ఉపాధి వృత్తుల వైపు మొగ్గు చూపారు.
భూపాలపల్లి, ములుగు జిల్లాల్లో గత పది నెలలుగా నమోదైన కేసుల వివరాలు
సారా తయారీకి జంకుతున్న తయారీదారులు
ఓ పక్క ఎకై ్సజ్ అధికారుల దాడులు మరో పక్క పోలీసుల అవగాహనలు
ఉపాధికి తోడ్పాటునందించాలని
తయారీదారుల వేడుకోలు
దాడులు.. అవగాహన సదస్సులు
ప్రభుత్వ ఆదేశాల మేరకు ఎకై ్సజ్ అధికారులు, పోలీసులు గుడాంబా తయారీని రూపుమాపడం కోసం తీవంగా కృషి చేస్తున్నారు. ఓ పక్క ఎకై ్సజ్ అధికారులు దాడులు నిర్వహించి గుడాంబా తయారీని అడ్డుకుంటుండగా సివిల్ పోలీసులు మాత్రం తమదైన రీతిలో తయారీదారులకు అవగాహన కల్పిస్తున్నారు. గుడుంబాతో కుటుంబాలు ఎలా రోడ్డున పడుతున్నాయో.. వారికి వివరిస్తూ పల్లె ప్రజల్లో మార్పునకు కృషి చేస్తున్నారు.
గుడుంబా నియంత్రణపై దృష్టి
గ్రామాల్లో గుడుంబా తయారీ, రవాణా నియంత్రణపై ప్రత్యేక దృష్టి సారించాం. గ్రామాల్లో గుడుంబాను పూర్తిగా నివారించడమే లక్ష్యంగా ముందకెళ్తున్నాం. తయారీదారుల్లో మార్పు రాకుంటే కఠినంగా వ్యవహరించి కేసులు నమోదు చేస్తాం. యువత, మహిళలు గుడాంబా నియంత్రణకు సహకరించాలి.
– శ్రీనివాస్, ఎకై ్సజ్ సూపరింటెండెంట్
Comments
Please login to add a commentAdd a comment