ఉచిత విద్య, వైద్యం అందించాలి
భూపాలపల్లి రూరల్: రాష్ట్రంలోని ప్రజలందరికీ నాణ్యమైన ఉచిత విద్యతో పాటు వైద్యం అందించాలని ధర్మసమాజ్ పార్టీ జిల్లా అధ్యక్షుడు కొత్తూరి రవీందర్ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ధర్మ సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో వివిధ డిమాండ్‌లతో కూడిన కరపత్రాలతో జిల్లాకేంద్రంలోని అంబేడ్కర్ సెంటర్‌లో సోమవారం ధర్నా నిర్వహించారు. ఈ ధర్నాలో రవీందర్ మాట్లాడుతూ రాష్ట్రంలోని ప్రతీ గ్రామంలో అత్యాధునికమైన పాఠశాల, కళాశాల, ఆధునిక ఆస్పత్రులను నిర్మించాలన్నారు. అర్హతలను బట్టి చేతినిండా గౌరవప్రదమైన పనిని కల్పించాలని డిమాండ్ చేశారు. అర్హులైన వారందరికీ సాగునీటి సౌకర్యంతో ఒక ఎకరం వ్యవసాయ భూమితో పాటు, 200 గజాల స్థలంలో నాలుగు గదుల ఇళ్లను నిర్మించి ఇవ్వాలని కోరారు. ధర్నాకు బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు భీమనాథుని సత్యనారాయణ, సేవాలాల్ సేన జిల్లా అధ్యక్షుడు భూక్య సురేష్ నాయక్, రాష్ట్ర విద్యార్థి సంఘం అధ్యక్షుడు గుగులోతు సంతోష్ నాయక్, సీపీఐ ఎంఎల్ లిబరేషన్ పార్టీ జిల్లా కార్యదర్శి మారేపల్లి మల్లేష్, ఎస్సీ వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి భూపాలపల్లి టౌన్ అధ్యక్షుడు జోగుల సమ్మయ్య మద్దతు పలికారు. ఈ కార్యక్రమంలో ధర్మ సమాజ్ పార్టీ జిల్లా నాయకులు కండె రవి, చిట్యాల శ్రీనివాస్, శీలపాక నాగరాజ్,వివిధ మండల నాయకులు పుల్ల అశోక్, కోరాళ్ల శ్యామ్, గుండ్ల ఓంకార్, దూడపాక రాజు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment