ఇసుక అక్రమ రవాణా నివారణకు చర్యలు
భూపాలపల్లి: ఇసుక అక్రమ రవాణా నివారణకు పటిష్ట చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు సూచించారు. ఐడీఓసీ కార్యాలయంలో ఎస్పీ కిరణ్ ఖరేతో కలిసి మైనింగ్, భూగర్భజలశాఖ, రెవెన్యూ, పంచాయతీ, పోలీస్ శాఖల అధికారులతో సోమవారం కలెక్టర్ రాహుల్ శర్మ సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. జిల్లాలోని వాగుల నుంచి అనుమతులు లేకుండా అక్రమంగా ఇసుక తరలిస్తున్న వాహనాలను సీజ్ చేయాలని ఆదేశించారు. గ్రామాల్లో ఇంటి నిర్మాణాల కోసం ఇసుక అవసరమైతే స్థానిక పంచాయతీ సెక్రటరీల ద్వారా రశీదు పొంది ఇసుక తరలించాలని తెలిపారు. ప్రతీరోజు ఉదయం ఆరు గంటలనుంచి సాయంత్రం ఆరు గంటల వరకు మాత్రమే రవాణాకు అనుమతి ఉంటుందన్నారు. నిర్దేశించిన సమయం తదుపరి రవాణా చేసే వాహనాలను సీజ్‌చేయాలని ఆదేశించారు. పంచాయతీ కార్యదర్శులు ఇసుక అనుమతులపై రిజిస్టర్ మెయింటెన్ చేయాలని పేర్కొన్నారు. పోలీసు, రెవెన్యూ, మైనింగ్ తదితర శాఖల అధికారులు నిత్యం తనిఖీలు చేపట్టి అనుమతులు లేని వాహనాలను సీజ్ చేయాలన్నారు. ఈ సమావేశంలో డీపీఓ నారాయణరావు, వివిధ శాఖల జిల్లా అధికారులు, తహసీల్దార్లు పాల్గొన్నారు.
భూ నిర్వాసితులకు న్యాయం చేస్తాం
భూపాలపల్లి అర్బన్: ఓపెన్ కాస్ట్–2 ప్రాజెక్ట్‌లో భూములు, ఇళ్లు కోల్పోతున్న భూనిర్వాసితులకు న్యాయం చేస్తామని ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు తెలిపారు. ఐదు రోజులుగా భూ నిర్వాసితులు ఓసీ–2 పనులను అడ్డుకొని ఆందోళన చేస్తున్న విషయం తెలిసిందే. పలుమార్లు సింగరేణి, రెవెన్యూ, పోలీస్ అఽధికారులు భూనిర్వాసితులతో చర్చలు జరిపినప్పటికీ ఆందోళన విరమించలేదు. చివరికి ఎమ్మెల్యే జోక్యం చేసుకొని అఽధికారులతో కలిసి సోమవారం రాత్రి దీక్షా శిబిరానికి వెళ్లి భూనిర్వాసితులతో మాట్లాడారు. ప్రభుత్వంతో మాట్లాడి వారం రోజుల్లో న్యాయం చేస్తామని హామీఇచ్చారు.
ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు
Comments
Please login to add a commentAdd a comment