సివిల్ వివాదాలు కోర్టులో పరిష్కరించుకోవాలి
● ఎస్పీ కిరణ్ ఖరే
భూపాలపల్లి: సివిల్ వివాదాలను కోర్టుల్లో పరిష్కరించుకోవాలని ఎస్పీ కిరణ్ ఖరే సూచించారు. సోమవారం జిల్లా పోలీసు కార్యాలయంలో నిర్వహించిన ప్రజా దివస్ కార్యక్రమంలో భాగంగా వివిధ సమస్యలపై వచ్చిన 18మంది నుంచి ఎస్పీ ఫిర్యాదులు స్వీకరించి వాటిని చట్ట ప్రకారం పరిష్కరించాలని సంబంధిత పోలీసు అధికారులను ఆదేశించారు. ప్రజల ఫిర్యాదులను పెండింగ్లో ఉంచరాదని వెంటనే పరిష్కరించాలని అన్నారు. ప్రస్తుతం సైబర్ నేరాలు పెరుగుతున్నాయని, సైబర్ నేరాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. అత్యవసర సమయంలో డయల్ 100కు ఫోన్చేయాలని ఎస్పీ కిరణ్ ఖరే సూచించారు.
Comments
Please login to add a commentAdd a comment