నేడు స్వామి వారి కల్యాణం | - | Sakshi
Sakshi News home page

నేడు స్వామి వారి కల్యాణం

Published Fri, Nov 29 2024 1:26 AM | Last Updated on Fri, Nov 29 2024 1:26 AM

నేడు

నేడు స్వామి వారి కల్యాణం

రేగొండ: మండలంలోని కొడవటంచ శ్రీలక్ష్మీనరసింహస్వామి దేవస్థానంలో స్వాతి నక్షత్రం సందర్భంగా నేడు (శుక్రవారం) స్వామి వారి కల్యాణం జరపనున్నట్లు ఆలయ ఈఓ మహేష్‌ తెలిపారు. ఉదయం సుదర్శన నరసింహ హోమం, స్వామి వారి అభిషేకం అనంతరం కల్యాణం నిర్వహించనున్నట్లు ఈఓ తెలిపారు.

సీఎం దిష్టిబొమ్మ దహనం

భూపాలపల్లి అర్బన్‌: విద్యావ్యవస్థను నిర్లక్ష్యం చేశారని విమర్శిస్తూ ఏబీవీపీ ఆధ్వర్యంలో గురువారం జిల్లాకేంద్రంలో సీఎం రేవంత్‌రెడ్డి బొమ్మను దహనం చేశారు. ఈ సందర్భంగా ఏబీవీపీ ప్రాంత కార్య సమితి సభ్యుడు వేల్పుల రాజ్‌కుమార్‌ మాట్లాడుతూ.. కాంగ్రెస్‌ ప్రభుత్వం నిర్లక్ష్యం మూలంగా 51మంది విద్యార్థులు ఫుడ్‌ పాయిజన్‌ వివిధ కారణాలతో చనిపోయినట్లు తెలిపారు. ప్రభుత్వం నుంచి ఎటువంటి స్పందన కూడా లేదన్నారు. విద్యాశాఖ మంత్రిని నియమించాలని కోరారు. ఈ కార్యక్రమంలో నాయకులు ప్రేమ్‌కుమార్‌, వికాస్‌, సాయి, రామ్‌చరణ్‌, లక్ష్మణ్‌, బంటి, విఘ్నేష్‌, సంతోష్‌, విష్ణు పాల్గొన్నారు.

మాంటిస్సోరి యాజమాన్యం ఆర్థికసాయం

భూపాలపల్లి అర్బన్‌: కాలేయ వ్యాధితో ఓ ప్రైవేట్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న పాఠశాల విద్యార్థిని పి.మోహనసాయిప్రియకు మాంటిస్సోరి పాఠశాల యాజమాన్యం ఆధ్వర్యంలో గురువారం ఆర్థిక సాయం అందజేశారు. పాఠశాల ఆవరణలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ఎస్పీ కిరణ్‌ఖరే హాజరై విద్యార్థిని తండ్రి యుగేంద్రచారికి రూ.2,38,260 చెక్కును అందజేశారు. ఈ సందర్భంగా పాఠశాల విద్యార్థులను, యాజమానాన్ని ఎస్పీ అభినందించారు. ఈ కార్యక్రమంలో చైర్మన్‌ జోస్‌ నెడుంతుండం, అధ్యక్షుడు గండ్ర సుధాకర్‌రెడ్డి, డైరెక్టర్‌ శ్రీనివాసరావు, ఉపాధ్యాయులు, సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.

ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభం

పలిమెల: మండలంలోని సర్వాయిపేటలో ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని గురువారం డీఆర్‌డీఓ నరేష్‌ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రైతులు ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. దళారులను నమ్మిమోసపోవద్దని సూచించారు. ధాన్యం కొనుగోలు కేంద్రం వద్ద రైతులకు ఇబ్బందులు కలగకుండా అధికారులు అన్ని ఏర్పాట్లు చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో అదనపు డీఆర్‌డీఓ గోవింద్‌, ఏపీఎం రవికుమార్‌, సమాఖ్య ప్రెసిడెంట్‌ స్వరూప, కమిటీ సభ్యులు, రైతులు పాల్గొన్నారు.

డిసెంబర్‌ 4న

న్యాస్‌ పరాక్‌ సర్వే

చిట్యాల: మండలంలోని సెలెక్టెడ్‌ పాఠశాలల్లో డిసెంబర్‌ 4న జరిగే న్యాస్‌ పరాక్‌ సర్వే (నేషనల్‌ అచీవ్‌మెంట్‌ సర్వే)ను విజయవంతం చేయాలని న్యాస్‌ జిల్లా కో–ఆర్డినేటర్‌ ఎస్‌.రమేష్‌, జిల్లా అకాడమీక్‌ కో ఆర్డినేటర్‌ కె.లక్ష్మన్‌ పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా మండలకేంద్రంలోని ఉన్నత పాఠశాలలో చిట్యాల, టేకుమట్ల, మొగుళ్లపల్లి, రేగొండ, గోరికొత్తపల్లి ఐదు మండలాలకు చెందిన సూపర్‌వైజర్‌లు, ఫీల్డ్‌ ఇన్వెస్టిగేటర్‌లకు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. అనంతరం వారు మాట్లాడుతూ మండలాలలో ఎంపికై న పాఠశాలల్లో సర్వే విజయవంతం చేయడంలో ఫీల్డ్‌ ఇన్వెస్టిగేటర్ల పాత్ర కీలకం అన్నారు. ఎంఈఓ కొడెపాక రఘుపతి మాట్లాడుతూ దేశ వ్యాప్తంగా 3, 6, 9 తరగతుల విద్యార్థుల విద్యా సామర్థ్యాలను తెలుసుకునేందుకు న్యాస్‌ పరీక్ష నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఆర్పీ రతన్‌సింగ్‌, ఇన్‌చార్జ్‌ ప్రధానోపాధ్యాయులు శ్రీరాం రఘుపతి పాల్గొన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
నేడు స్వామి వారి కల్యాణం
1
1/3

నేడు స్వామి వారి కల్యాణం

నేడు స్వామి వారి కల్యాణం
2
2/3

నేడు స్వామి వారి కల్యాణం

నేడు స్వామి వారి కల్యాణం
3
3/3

నేడు స్వామి వారి కల్యాణం

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement