దేవాదులలో పంపింగ్ నిలిపివేత
కన్నాయిగూడెం: మండల పరిధిలోని గుట్టల గంగారం గ్రామ సమీపంలో గల దేవాదులలో మోటార్ల పంపింగ్‌ను గురువారం అధికారులు నిలిపివేశారు. గత కొన్ని నెలల నుంచి పంపింగ్ కొనసాగించిన విషయం తెలిసిందే. ఎగువ ప్రాంతంలో నీటి వినియోగాన్ని బట్టి పంపింగ్ కొనసాగిస్తామని డీఈఈ శరత్ తెలిపారు. ప్రస్తుతం పంపింగ్ వద్ద 79.30 మీటర్ల నీటిమట్టం కొనసాగుతోంది. తుపాకులగూడెం వద్ద ఉన్న సమ్మక్కసాగర్ బ్యారేజీ వద్ద 79.30 మీటర్లు నీటిమట్టం ఉండగా బ్యారేజీలోకి ఎగువ ప్రాంతం నుంచి 33వేల నీటి ప్రవాహం కొనసాగుతోంది. బ్యారేజీలో 59 గేట్లు ఉండగా అందులో 3గేట్లను మాత్రమే ఓపెన్ చేసి 33వేల నీటిని దిగువకు వదులుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment