నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు
చిట్యాల/టేకుమట్ల: చిట్యాల, టేకుమట్ల మండలాలలో ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలలో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవని అదనపు కలెక్టర్ అశోక్‌కుమార్ అన్నారు. ఈ సందర్భంగా గురువారం మండలంలోని దూత్‌పల్లి, అందుకుతండా, గిద్దెముత్తారం, టేకుమట్ల మండల కేంద్రంతో పాటు వెలిశాల గ్రామంలోని కొనుగోలు కేంద్రాలను తనిఖీ చేశారు. అనంతరం రికార్డుల నిర్వహణ, ట్యాబ్ ఎంట్రీలను పరిశీలించారు. సక్రమంగా డేటా ఎంట్రీ చేయటం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ధ్యానం కొనుగోలు కేంద్రాల ప్రక్రియ వేగవంతం చేయాలని అన్నారు. కొనుగోలు చేసిన ధాన్యాన్ని రోజువారి నమోదు ప్రక్రియలను సక్రమంగా నిర్వహించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా పౌర సరఫరాల అధికారి శ్రీనాద్, తహసీల్దారు విజయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.
అదనపు కలెక్టర్ అశోక్ కుమార్
Comments
Please login to add a commentAdd a comment