సదుపాయాల కల్పనకు ప్రతిపాదనలు
భూపాలపల్లి: ప్రజలకు మెరుగైన వైద్యసేవలు అందించేందుకు ప్రభుత్వ ఆస్పత్రుల్లో మౌలిక సదుపాయాల కల్పనకు ప్రతిపాదనలు అందజేయాలని కలెక్టర్ రాహుల్ శర్మ వైద్యశాఖ అధికారులను ఆదేశించారు. ఆస్పత్రుల్లో మౌలిక సదుపాయాల కల్పన, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల నిర్మాణ పనుల పురోగతి, సిబ్బంది ఖాళీలు తదితర అంశాలపై గురువారం ఐడీఓసీ కార్యాలయంలో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ అధికారులకు కీలక సూచనలు చేశారు. ప్రజలకు అవసరమైన మెరుగైన వైద్య సేవలందించడానికి తక్షణ చర్యలు తీసుకోవాలన్నారు. ఖాళీ పోస్టులపై వివరాలు అందజేయాలని చెప్పారు. 10 ప్రాంతాల్లో పీహెచ్‌సీల నిర్మాణానికి స్థల సమస్య ఉందని, కాటారం సబ్ కలెక్టర్, భూపాలపల్లి ఆర్డీఓలకు నివేదికలు ఇవ్వాలని వైద్యాధికారులకు సూచించారు. చిట్యాల, మహదేవపూర్ కమ్యూనిటీ ఆస్పత్రుల్లో బయోమెడికల్ వ్యర్ధాలు వేసేందుకు షెడ్ నిర్మాణం చేపట్టాలన్నారు. ఈ సమీక్షలో డీఎంహెచ్‌ఓ డాక్టర్ మధుసూదన్, ప్రభుత్వ ప్రధాన ఆస్పత్రి పర్యవేక్షకులు డాక్టర్ నవీన్, వైద్య కళాశాల ప్రిన్సిపాల్ రాజేంద్రప్రసాద్, ఆస్పత్రుల సమన్వయ అధికారి డాక్టర్ శ్రీకాంత్ పాల్గొన్నారు.
కలెక్టర్ రాహుల్ శర్మ
Comments
Please login to add a commentAdd a comment