స్విమ్మింగ్ పోటీలకు ఏర్పాట్లు
భూపాలపల్లి అర్బన్: ఈనెల 7, 8 తేదీల్లో జిల్లాకేంద్రంలో జరగనున్న ఇంటర్ డిస్టిక్ర్ట్ సిమ్మింగ్ పోటీలకు ఏర్పాట్లు పూర్తి చేయాలని ఏరియా సింగరేణి జనరల్ మేనేజర్ ఏనుగు రాజేశ్వర్‌రెడ్డి తెలిపారు. గురువారం స్విమ్మింగ్‌పూల్‌ను పరిశీలించి పోటీల ఏర్పాట్లపై ఏరియా అధికారులతో జీఎం సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జీఎం మాట్లాడుతూ.. రెండు రోజుల పాటు ఈ స్విమ్మింగ్ చాంపియన్ షిప్ నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ఈ పోటీలకు సుమారు 500 మంది స్విమ్మర్లు, సహా యక సిబ్బంది, కోచ్‌లు పాల్గొనే అవకాశం ఉందన్నారు. పోటీల్లో పాల్గొనే సభ్యులకు వసతులు కల్పించడానికి నిర్వాహకులు వసతి, ఇతర అవసరమైన ఏర్పాట్లు అందించడానికి ఏర్పాట్లు వేగవంతం చేయాలని ఆదేశించారు. ఎస్‌ఓటు జీఎం కవీంద్ర, అధికారులు బాలరాజు, స్విమ్మింగ్ అసోసియేషన్ అధ్యక్షుడు రమేష్, సిబ్బంది పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment