హామీలు నెరవేరుస్తున్నాం..
భూపాలపల్లి రూరల్: ప్రజలకు ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను నెరవేరుస్తున్నామని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు అన్నారు. ప్రజా పాలన ప్రజా విజయోత్సవాల్లో భాగంగా గురువారం సాయంత్రం భూపాలపల్లి బస్ డిపో మేనేజర్ ఇందూ ఆధ్వర్యంలో ఆర్టీసీ బస్టాండ్ లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఎమ్మెల్యే పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 2025 మార్చిలో ప్రభుత్వం సుమారు వెయ్యి బస్సులు ప్రారంభించనుందన్నారు. కొత్త బస్సులను భూపాలపల్లి డిపోకు తీసుకువచ్చి తిరుపతి, బెంగళూరు వంటి దూరపు ప్రాంతాలను నడిపిస్తామని తెలిపారు. ఎమ్మెల్యేను పలువురు అధికారులు, ఆర్టీసీ సిబ్బంది సన్మానించారు. అనంతరం ఆర్టీసీ డిపో ప్రాంగణంలో డీఎంతోపాటు కాంగ్రెస్ నాయకులతో కలిసి ఎమ్మెల్యే మొక్కను నాటారు. ఈ కార్యక్రమంలో డిపో అధికారులతో పాటు మెకానిక్‌లు, సిబ్బంది, కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్లు, దాట్ల శ్రీనివాస్, శిరుప అనిల్, ముంజాల రవీందర్ పాల్గొన్నారు.
ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు
Comments
Please login to add a commentAdd a comment