రామప్పను సందర్శించిన నెదర్లాండ్ వాసి
వెంకటాపురం(ఎం): ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన సుప్రసిద్ధ రామప్ప దేవాలయాన్ని నెదర్లాండ్‌కు చెందిన ఏస్లీ స్లాట్స్ సందర్శించారు. రామప్ప రామలింగేశ్వరస్వామిని ఆమె గురువారం దర్శించుకోగా ఆలయ పూజారులు తీర్థప్రసాదాలు అందించి ఆశీర్వదించారు. భూపాలపల్లి ఎస్పీ కిరణ్ ఖరే సైతం రామప్ప ఆలయాన్ని సందర్శించి రామప్ప రామలింగేశ్వరస్వామికి పూజలు నిర్వహించారు. ఆలయ విశిష్టత గురించి నెదర్లాండ్ దేశస్తురాలికి టూరిజం గైడ్ సాయినాథ్ వివరించగా, ఎస్పీ కిరణ్ ఖరేకు గైడ్ తాడబోయిన వెంకటేశ్ వివరించారు. రామప్ప శిల్పకళ సంపద బాగుందని వారు కొనియాడారు.
Comments
Please login to add a commentAdd a comment