పారదర్శకంగా ఇందిరమ్మ ఇళ్ల సర్వే
భూపాలపల్లి అర్బన్: ఇందిరమ్మ మొబైల్ యాప్ ద్వారా ఇందిరమ్మ ఇళ్ల సర్వేను పారదర్శంగా చేయాలని కలెక్టర్ రాహుల్‌శర్మ ఆదేశించారు. మొబైల్ యాప్ విధానంపై కలెక్టరేట్‌లోని కాన్ఫరెన్స్ హాల్‌లో శనివారం అవగాహన సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. పొరపాట్లకు తావులేకుండా లబ్ధిదారుల వివరాలు నిష్పక్షపాతంగా నమోదుచేయాలని సూచించారు. ప్రజాపాలన కార్యక్రమం సందర్భంగా ఇందిరమ్మ ఇళ్ల కోసం దరఖాస్తులు చేసుకున్న వారి ఇళ్లకు వెళ్లి ఏయే అంశాలను పరిశీలించాలి, మొబైల్ యాప్‌లో వివరాలను ఏ విధంగా పొందుపర్చాలి అనే అంశాలను పీపీటీ ద్వారా ప్రయోగాత్మకంగా వివరించారు. వివాదాలు, అవకతవకలకు తావులేకుండా సర్వే ప్రక్రియను నిజాయితీగా, నిబద్దతతో ఈ నెల 20వ తేదీ వరకు పూర్తిచేయాలని సూచించారు. ఈ అవగాహన సమావేశంలో కాటారం సబ్ కలెక్టర్ మయాంక్‌సింగ్, డీపీఓ నారాయణరావు, ఆర్డీఓ మంగీలాల్, మండల ప్రత్యేక అధికారులు, ఎంపీడీఓలు, ఎంపీఓలు, కార్యదర్శులు పాల్గొన్నారు.
పొరపాట్లు లేకుండా ఓటరు జాబితా
పొరపాట్లకు ఆస్కారం లేకుండా పరిపూర్ణమైన ఓటరు జాబితా తయారు చేయాలని ఓటరు జాబితా పరిశీలకురాలు అయేషా మస్రత్ తెలిపారు. కలెక్టరేట్‌లో జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ రాహుల్‌శర్మతో కలిసి రిటర్నింగ్ అధికారులు, పర్యవేక్షకులు, బూత్ స్థాయి అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు.
సరస్వతి పుష్కరాలకు నివేదికలు
అందజేయాలి
వచ్చే ఏడాది మే నెలలో నిర్వహించే సరస్వతి పుష్కరాల నిర్వహణకు అధికారులు అంచనాలు, నివేదికలు అందజేయాలని కలెక్టర్ రాహుల్ శర్మ అన్నారు. కలెక్టర్ రాహుల్ శర్మ శనివారం వివిధ శాఖల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. సుప్రసిద్ధ పుణ్య క్షేత్రం కాళేశ్వరంలో మే 15 నుంచి 26వ తేదీ వరకు 12 రోజుల పాటు పుష్కరాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. గత పుష్కరాల అనుభవాలను దృష్టిలో ఉంచుకొని కాళేశ్వరంలో అన్ని ఏర్పాట్లను అన్ని శాఖల అధికారులు సమన్వయంతో చేయాలని తెలిపారు. ఈ సమావేశంలో కాటారం సబ్ కలెక్టర్ మయాంక్ సింగ్, అదనపు కలెక్టర్ అశోక్‌కుమార్, డీపీఓ నారాయణరావు, డీపీఆర్‌ఓ శ్రీనివాస్, జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ మధుసూదన్, ఆర్‌అండ్‌బీ ఈఈ వెంకటేశ్వర్లు, దేవస్థానం ఈఓ మారుతి, తహసీల్దార్‌లు, ఎంపీడీఓలు పాల్గొన్నారు.
కలెక్టర్ రాహుల్‌శర్మ
Comments
Please login to add a commentAdd a comment