ఆవిష్కరణలు అదరహో..
భూపాలపల్లి అర్బన్: జిల్లా కేంద్రంలోని శాంతినికేతన్ (బిట్స్) పాఠశాలలో నిర్వహించిన 52వ జిల్లా బాల వైజ్ఞానిక ప్రదర్శన 2024–25 జిల్లా స్థాయి ఇన్‌స్పైర్ మానక్ ప్రదర్శన పోటీలు శనివారం అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. వివిధ ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల విద్యార్థులు ప్రదర్శించిన ఎగ్జిబిట్లు విద్యార్థులను, ఉపాధ్యాయులను ఆకట్టుకున్నాయి. అత్యుత్తమ ప్రాజెక్ట్‌లను రాష్ట్రస్థాయి సైన్స్‌ఫెయిర్‌కు ఎంపిక చేయనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. వివిధ మండలాల నుంచి విద్యార్థులు తరలివచ్చి ఎగ్జిబిట్లను తిలకించారు. ఈ సందర్భంగా విద్యార్థులు ప్రదర్శించిన కొన్ని ఎగ్జిబిట్లు పలువురిని ఆలోచింపజేశాయి. జిల్లావ్యాప్తంగా 325 ఎగ్జిబిట్లను విద్యార్థులు ప్రదర్శించారు.
ఎడారిలో విద్యుత్ తయారు..
(ఎ.అక్షిత, ఎం.శరణ్య, జెడ్పీహెచ్‌ఎస్ గొర్లవీడు)
కలబంధను చర్మ సౌందర్యానికి కాకుండా విద్యుత్ ఉత్పత్తికి కూడా ఉపయోగించుకోవచ్చు. విద్యుత్ సౌకర్యం, విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలు లేని ప్రదేశాలలో ఇంటి ఆవరణలో పెంచుకునేటువంటి కలబంధ(అలోవేరా)తో విద్యుత్ ఉత్పత్తిని తయారుచేసే విధానాన్ని విద్యార్థులు కనుగొన్నారు. ఏడారి ప్రాంతాలలో ఈ పరికరం ఉపయోగపడుతుంది. ఏడారిలో కలబంధ మొక్కలు అఽధికంగా పెరుగుతాయి.
ట్రాఫిక్ జామ్ ముందుగా తెలిపేలా..
అద్దంలో నిజ ప్రతిబింబం కనిపించేలా..
ఆకట్టుకున్న ఎగ్జిబిట్లు
Comments
Please login to add a commentAdd a comment