‘ఖాకీ’ సినిమా తరహాలో..
ఆదివారం శ్రీ 8 శ్రీ డిసెంబర్ శ్రీ 2024
– 8లోu
ఖాకీ సినిమాలో దోపిడీ దొంగలను పట్టుకునేందుకు వెళ్లిన పోలీస్ బృందంపై ఆ గ్రామస్తులు మూకుమ్మడిగా దాడి చేస్తారు. వారినుంచి పోలీసులు చాకచక్యంగా తప్పించుకుంటారు. అదే తరహాలో ఈ కక్రలా గ్రామంలోనూ కనిపిస్తుంటుంది. మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాల్లో బ్యాంకు లాకర్ల నుంచి 13 కిలోలు దొంగతనం చేసిన కేసులో 2023 జూన్ 30వ తేదీన కక్రలా గ్రామానికి చెందిన అయాజ్, ఆలీ నయీమ్, యూసఫ్ ఖాన్‌ను పట్టుకునేందుకు వెళ్లిన పోలీసులపై అక్కడి గ్రామస్తులు సంఘటితమై దాడికి దిగారు. ఒకానొక దశలో ఆ ముగ్గురు నిందితులు కాల్పులు జరపడంతో చాకచక్యంగా వ్యవహరించిన పోలీసులు వారిని పట్టుకోగలిగారు. ఇలా.. చాలా కేసుల్లో అక్కడికెళ్లిన పోలీసులకు బ్యాంకు దొంగలను పట్టుకోవాలంటే ముచ్చెమటలు పట్టాల్సిన పరిస్థితి ఉంది. కొన్ని సందర్భాల్లో పోలీసుల ప్రాణానికి కూడా ప్రమాదం ఏర్పడే అవకాశం లేకపోలేదు.
సాక్షి, వరంగల్:
వరంగల్ పోలీసులకు ఉత్తరప్రదేశ్‌లోని బదౌన్ జిల్లా కక్రలా గ్రామం సవాల్ విసురుతోంది. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ) రాయపర్తి బ్రాంచ్‌లో గత నెల 18న అర్ధరాత్రి దాటిన తర్వాత జరిగిన 19 కిలోల బంగారం చోరీ కేసులో ఈ గ్రామానికి చెందిన అన్నదమ్ములు మహమ్మద్ నవాబ్ హసన్, సాజీద్ ఖాన్ కీలక సూత్రధారులు. గ్యాస్ వెల్డింగ్ పనిచేయడంలో అపార ప్రావీణ్యమున్న వీరిలో ఒకడైన సాజీద్ ఖాన్ 2015లో తమిళనాడు కృష్ణగిరి జిల్లా గురుబరపల్లి గ్రామంలోని జాతీయ బ్యాంక్ నుంచి 48 కిలోల బంగారం చోరీ ఘటనలో ప్రధాన నిందితుడు. వీరే కాదు ఈగ్రామంలో 63 ఇళ్లు ఉంటే దాదాపు సగానికిపైగా కుటుంబాలు గ్యాస్ వెల్డింగ్‌లో సిద్ధహస్తులు. నిమిషాల వ్యవధిలోనే గ్యాస్ కట్టర్ సహకారంతో స్టీల్ గ్రిల్స్‌ను కట్ చేస్తారు. ఏటీఎం, బ్యాంకు దొంగతనాల్లో వీరిది అందెవేసిన చెయ్యి. పదో తరగతి వరకు కూడా చదువుకోని వీళ్లు పదేళ్లుగా బ్యాంకు దొంగతనాలు, ఏటీఎం చోరీల్లో ప్రావీణ్యం చూపుతున్నారు. మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో పంజా విసురుతూ పోలీసులకే చుక్కలు చూపిస్తున్నారు.
న్యూస్‌రీల్
ఈపల్లెలో సగానికిపైగా కుటుంబాలు గ్యాస్ వెల్డింగ్‌లో సిద్ధహస్తులు
పెద్దగా చదువుకోకపోయినా దేశవ్యాప్తంగా సంచలన చోరీ కేసుల్లో వీరే కీలకం
వివిధ రాష్ట్రాల్లోని పలు బ్యాంకుల్లో దోపిడీ.. బంగారంపైనే కన్ను
అన్నదమ్ములిద్దరినీ పట్టుకుంటేనే భారీ రికవరీ సాధ్యం
Comments
Please login to add a commentAdd a comment