విద్యతో పాటు క్రీడల్లో రాణించాలి
భూపాలపల్లి: విద్యార్థులు విద్యతో పాటు క్రీడల్లో రాణించాలని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు అన్నారు. జిల్లా కేంద్రంలోని సింగరేణి స్విమ్మింగ్ పూల్‌లో శనివారం నిర్వహించిన 9వ తెలంగాణ శీతాకాల ఇంటర్ డిస్ట్రిక్ట్ చాంపియన్ షిప్ –2024 పోటీలను ఎమ్మెల్యే ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ రాష్ట్రస్థాయి స్వి మ్మింగ్ పోటీలు భూపాలపల్లిలో నిర్వహించడం గ ర్వకారణమన్నారు. క్రీడాకారులకు ఎటువంటి ఇబ్బంది తలెత్తకుండా తగిన సౌకర్యాలు కల్పించాలని సింగరేణి అధికారులకు సూచించారు. జిల్లాలోని క్రీడాకారులు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో రాణించి భూపాలపల్లికి మంచిపేరు తీసుకురా వాలని ఆకాంక్షించారు. జిల్లా కేంద్రంలో ప్రస్తుతం 25 మీటర్ల స్విమ్మింగ్ పూల్ మాత్రమే ఉందని, 50 మీటర్ల స్విమ్మింగ్ పూల్ ఏర్పాటుకు సింగరేణి అధికారులతో మాట్లాడుతానని అన్నారు. కార్యక్రమంలో సింగరేణి భూపాలపల్లి ఏరియా ఇన్‌చార్జ్ జీఎం వెంకటరాంరెడ్డి, స్విమ్మింగ్ అసోసియేషన్ సభ్యులు పైడిపెల్లి రమేశ్, జల్ది రమేష్, సింగరేణి క్రీడా సూపర్‌వైజర్ పర్స శ్రీనివాస్, స్విమ్మింగ్ కోచ్‌లు పాక శ్రీని వాస్, తిరుపతి, అఖిల్, నరేష్ పాల్గొన్నారు.
అవినీతిలేని పాలన
భూపాలపల్లి రూరల్: అవినీతిలేని పాలన, నియోజకవర్గ అభివృద్ధే లక్ష్యంగా రోజుకు 18గంటలు పనిచేస్తున్నామని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు అన్నారు. ఏడాది పాలన పూర్తయిన సందర్భంగా పార్టీ జిల్లా కార్యాలయంలో ఏర్పాటుచేసిన సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడారు. ఏడాది కాలంలో ముఖ్యమంత్రి, మంత్రుల సహకారంతో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టనున్నారు. రూ.3కోట్లతో గాంధీనగర్ గుట్టపై అభివృద్ధి పనులు, మైలారం గుట్టపై యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్‌ను ఏర్పాటుకు శంకుస్థాపనలు మంత్రులతో చేపించానన్నారు. భూపాలపల్లిలో ప్రభుత్వ నర్సింగ్ కాలేజీని ప్రారంభించినట్లు చెప్పారు. ప్రస్తుతం ఉన్న 100 పడకల ఆస్పత్రిని 200 పడకల స్థాయికి పెంచినట్లు పేర్కొన్నారు. సింగరేణి ఏరియా హాస్పిటల్‌లో రూ.3 కోట్లతో సిటి స్కాన్ యంత్రాన్ని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ప్రభుత్వ వైద్య కాలేజీలో పలు విభాగాల్లో 36 వైద్య, మరో 40 వైద్య సిబ్బంది పోస్టులను భర్తీ చేసినట్లు తెలిపారు. టేకుమట్ల, కొత్తపల్లిగోరి మండలాల్లో రూ.6కోట్లతో తహసీల్దార్, ఎంపీడీఓ నూతన భవనాల నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశామని చెప్పారు. ఈ సమావేశంలో పార్టీ అర్బన్ అధ్యక్షుడు దేవన్, కౌన్సిలర్లు దాట్ల శ్రీనివాస్, ముంజాల రవీందర్, శిరుప అనిల్, కురిమిల్ల రజిత శ్రీనివాస్ పాల్గొన్నారు.
ఎమ్మెల్యే సత్యనారాయణరావు
Comments
Please login to add a commentAdd a comment