పాఠశాల ఆవరణ శుభ్రంగా ఉంచాలి
భూపాలపల్లి అర్బన్ : ప్రభుత్వ పాఠశాలల్లో ఆవరణలను పారిశుద్ధ్య కార్మికులు ఎప్పుటికప్పుడు శుభ్రం చేస్తూ పరిశుభ్రంగా ఉంచాలని జెడ్పీ సీఈ ఓ, ఇన్‌చార్జ్ అడిషనల్ కలెక్టర్ విజయలక్ష్మి ఆదేశించారు. బుధవారం ఇన్‌చార్జ్ అడిషనల్ కలెక్టర్ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా వారు మా ట్లాడుతూ విద్యార్థులకు కావాల్సిన మౌళిక సదుపాయాలు కల్పించడంలో అప్రమత్తంగా ఉండాలని, ఏవైనా మరమ్మతు ఉన్నచో వాటిని వెంటనే రిపేర్లు చేయాలని మునిసిపల్ కమిషనర్ ఆదేశించారు. అంతకు ముందు పట్టణంలోని పలు కాలనీల్లో జరుగుతున్న ఇందిరమ్మ ఇళ్ల సర్వేను పరిశీలించారు.
Comments
Please login to add a commentAdd a comment