జిల్లా స్థాయి పోటీల్లో విద్యార్థుల ప్రతిభ
కాటారం: సీఎం కప్–2024 జిల్లా స్థాయి పోటీల్లో మండల కేంద్రంలోని గిరిజన సంక్షేమ బా లికల గురుకుల అప్‌గ్రేడ్ కళాశాల విద్యార్థినులు ప్రతిభ కనబర్చారు. పోటీల్లో భాగంగా పలు విభాగాల్లో విద్యార్థినులు సత్తా చాటారు. కబడ్డీ, ఖోఖో, వాలీబాల్, చెస్, డిస్కస్ త్రో, బేస్‌బాల్ విభాగాల్లో ప్రథమ స్థానం, షార్ట్‌పుట్ ద్వితీయ స్థానం, లాంగ్ జంప్ ప్రథమ, ద్వితియ, 100, 400 రన్నింగ్ రేస్‌లో పాఠశాల ప్రథమ స్థానంలో గెలుపొందారు. విద్యార్థినులు జిల్లా స్థాయిలో రాణించడంపై పీడీ గౌతమి, పీఈటీ శ్రీవిద్యను ప్రిన్సిపాల్ నాగలక్ష్మి, సీనియర్ వైస్ ప్రిన్సిపాల్ సరిత, జూనియర్ వైస్ ప్రిన్సిపాల్ కల్పన ప్రత్యేకంగా అభినందించారు.
Comments
Please login to add a commentAdd a comment