పిల్లలు, పెద్దలు జాగ్రత్త..
గురువారం శ్రీ 19 శ్రీ డిసెంబర్ శ్రీ 2024
ఎంజీఎం : చలి తీవ్రత ఎక్కువైనందున పిల్ల లు, పెద్దలు జాగ్రత్తలు తీసుకోవాలి. ఎక్కువ చలితో చర్మం, ఊపిరితిత్తుల సమస్యలతోపాటు గుండె సంబంధ వ్యాధుల వారికి డిప్రెషన్ పెరిగే అవకాశం ఉంటుంది.
● చర్మం పొడిబారకుండా మాశ్చరైజర్ రాసుకోవాలి. న్యూమోనియా, బ్రాంకై టీస్, అస్తమా వంటి ఊపిరితిత్తుల ఇబ్బంది తలెత్తకుండా చల్లగాలిలో తిరగడం, దుమ్ము ధూళి ఉండే పరిసరా లకు, రద్దీగా ఉండే ప్రదేశాలకు దూరంగా ఉండాలి. చర్మ సంరక్షణ కోసం రో జూ 6 నుంచి 8 గ్లాసుల నీరు తాగాలి.
● పొడి దగ్గు, పిల్లి కూతలు, ఛాతిలో బరువు ముఖ్యంగా రాత్రివేళలో ఈ లక్షణాలు కనిపిస్తే అస్తమాగా భావించాలి.
● పెద్దల్లో దగ్గు మాత్రమే ఉంటే అస్తమా కాదు. రాత్రి, ఉదయం వేళలో అధికమవుతుంది. అధిక వ్యాయామం, అలెర్జీలు, చల్లటి గాలి ద్వారా తీవ్రమయ్యే అవకాశం ఉంది. అస్తమా మందులు వాడేవారు ఇన్‌హేలర్లు క్రమం తప్పకుండా వినియోగించాలి.
● శీతాకాలంలో ఊపిరితిత్తుల సమస్యలు వస్తే న్యూమోనియా, ఇన్‌ప్లూంజాగా పరిగణిస్తారు. వ్యాక్సినేషన్ వల్ల ఇన్‌ఫెక్షన్ తీవ్రత తగ్గే అవకాశం ఉంది.
● గుండె వ్యాధులు ఉన్నవారు మందులు రెగ్యులర్‌గా వాడాలి. కొందరిలో గుండె వేగం తీవ్రత పెరిగే అవకాశం ఉంటుంది. వైద్యులను సంప్రదించాలి.
జిల్లాలో చలితీవ్రత రోజురోజుకూ పెరిగిపోతోంది. సాయంత్రం 6 గంటలు అయ్యిందంటే చాలు జనం బయటికి వెళ్లేందుకు జంకుతున్నారు. పొగమంచు కురవడంతోపాటు చల్లటి గాలులు వీస్తున్నాయి. రాత్రి ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి. నగరంలో వివిధ పనుల చేసుకునే వారు, గ్రామాల్లో చీకటి పడగానే చలిమంటలు వేసుకుంటున్నారు. ఉదయం 10 గంటల వరకు కూడా మంచు వీడడం లేదు.
ఊపిరితిత్తుల సమస్యలు ఉండే వారికి ఇబ్బందులు
డాక్టర్ ఎం.పవన్‌కుమార్ జనరల్
మెడిసిన్ ఎండి.ప్రొఫెసర్ భూపాలపల్లి
(డిగ్రీల
సెల్సియస్‌లలో)
Comments
Please login to add a commentAdd a comment