ప్రభుత్వ కళాశాలలో మధ్యాహ్న భోజనం
గోవిందరావుపేట: దాతల సహకారంతో మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో విద్యార్థులకు మధ్యాహ్న భోజన కార్యక్రమాన్ని ప్రిన్సిపాల్ చంద్రకళ ఆద్వర్యంలో తహసీల్దార్ సృజన్‌కుమార్ సోమవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా తహసీల్దార్ మాట్లాడుతూ.. గ్రామానికి చెందిన విద్యావేత్త ఎన్‌ఆర్‌ఐ వీరపనేని డాంగే కళాశాలలో చదువుతున్న 200 మంది విద్యార్థులకు మధ్యాహ్న భోజన కార్యక్రమానికి దాతగా ముందుకు రావడం సంతోషకరమైన విషయమన్నారు. మండలంలోని రైస్ మిల్లర్స్ యజమానులు రామకృష్ణ, సతీష్, శేఖర్ రెడ్డి మధ్యహ్న భోజన కార్యక్రమానికి సహకరించడం శుభపరిణామం అన్నారు. దాత వీరపనేని లక్ష్మీ, సోమారెడ్డి, ప్రిన్సిపాల్ శ్రీనివాస్, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment