నిరుద్యోగులను మోసం చేస్తున్న డీడీ
ఏటూరునాగారం: ఐటీడీఏ పరిధిలోని ఆదివాసీ నిరుద్యోగులను ఐటీడీఏ డిప్యూటీ డైరెక్టర్ పోచం మోసం చేస్తున్నారని ఆదివాసీ విద్యార్థుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కొప్పుల రవి అన్నారు. సీఆర్‌టీ జనరల్ నోటిఫికేషన్ రద్దు చేయాలని తుడుందెబ్బ ఆదివాసీ నాయకులు ఐటీడీఏ ఎదుట గల ప్రధాన రహదారిపై సోమవారం ధర్నా నిర్వహించారు. ఈ క్రమంలో ఎస్సై తాజొద్దీన్ అక్కడకు చేరుకుని వారిని శాంతింపజేశారు. అనంతరం ఐటీడీఏ భవనం పైకి ఎక్కి నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా తుడుందెబ్బ జిల్లా అధ్యక్షుడు పులిశె బాలకృష్ణ మాట్లాడుతూ అనర్హులు ఇచ్చే డబ్బులకు అమ్ముడుపోతూ ఉద్యోగాలను అమ్ముకుంటున్నాడని ఆరోపించారు. వెంటనే డీడీను సస్పెండ్ చేయాలన్నారు. అనంతరం గిరిజన అభ్యుదయ సంఘం జిల్లా అధ్యక్షులు ముద్ధబోయిన రవి మాట్లాడారు.
Comments
Please login to add a commentAdd a comment