మోడల్ స్కూల్‌లో నాణ్యమైన విద్య
టేకుమట్ల: కార్పోరేట్‌కు దీటుగా మోడల్ స్కూల్‌లో నాణ్యమైన విద్య లభిస్తుందని అర్హులైన విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని కొర్కిశాల మోడల్ స్కూల్ ప్రిన్సిపాల్ తాళ్లపెల్లి రాకేశ్ అన్నారు. మంగళవారం మండల కేంద్రంతో పాటు, మండలంలోని అంకుసాపూర్, సోమనపల్లి, సుబ్బక్కపల్లి, ఆసిరెడ్డిపల్లి గ్రామాల్లో కొర్కిశాల మోడల్ ఉపాధ్యాయ బృందం మోడల్ స్కూల్ ప్రవేశాల కర పత్రాలను పంపిణీ చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ మోడల్ స్కూళ్లలో ఆంగ్ల మాద్యమంలో విద్యాభ్యాసం కొనసాగుతుందని, కావున పట్టణాలకు పిల్లల్ని పంపించకుండా ప్రభుత్వం అందింస్తున్న ఉచిత విద్యను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. మొగుళ్లపల్లి మండలంలోని కొర్కిశాల మోడల్ స్కూల్‌లో 6వ తరగతిలో 100 సీట్లు, 7, 8, 9, 10 తరగతుల్లో మిగిలిన సీట్ల కోసం ప్రవేశాలను ఆహ్వానిస్తున్నట్లు తెలిపారు. దూర ప్రాంత విద్యార్థుల కోసం ఆర్టీసీ బస్సు సౌకర్యం కూడా ఉందని సూచించారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు గోపు కొమురెల్లి, యార దేవేందర్, అందె కుమార్, అజయ్, మార్క కిరణ్, పోతుగంటి మహేష్, గౌడ రాజ్‌కుమార్ ఉన్నారు.
ప్రిన్సిపాల్ తాళ్లపెల్లి రాకేశ్
Comments
Please login to add a commentAdd a comment