పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం
రేగొండ: కొత్తపల్లిగోరి మండలంలోని జగ్గయ్యపేట జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 2003–04 బ్యాచ్ పదో తరగతి విద్యార్థులు ఆత్మీయ సమ్మేళనం మంగళవారం నిర్వహించారు. ఇరవై ఏళ్ల తర్వాత కలుసుకోవడంతో ఆనాటి జ్ఞాపకాలను, మధుర స్మృతులను నెమర వేసుకున్నారు. అప్పటి ఉపాధ్యాయులు లక్ష్మణ్, పద్మ, శ్రీనివాస్, రాజేందర్, సుదయ్య, వేణుగోపాల ఆచార్యలను ఘనంగా సన్మానించారు. పూర్వ విద్యార్థులు శ్రావణి, రమ, స్వప్న, శ్రీలత, రాజు, రాజేష్, భారతి, వెంకటేష్, వినోద్, తిరుపతి, రమేశ్, ప్రభాకర్, చైతన్య, రత్నాకర్, రజిత, స్వరూప, మధుకర్ పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment