కంకర కుప్పతో ఇబ్బందులు
పలిమెల: మండలంలోని పంకెనలోని ప్రధాన రహదారిపై ఆరు నెలల క్రితం ఓ కాంట్రాక్టర్ సీసీ రోడ్డు వేయడానికి కంకర తీసుకొచ్చి రోడ్డుపై పోశాడు. రో డ్డు వేయకపోగా ఆరోడ్డు పైనే కంకర అలాగే ఉంచడంతో జారుతుంది. దీంతో వాహనదారులు ఆదమరిస్తే వాహనాలు స్కీడ్ అయి ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది. అధికారులు నిత్యం ఇదే రోడ్డుపై వెళ్తున్నప్పటికీ కంకరను తొలగించే ప్రయత్నం చే యలేదు. ఇప్పటికై నా అధికారులు స్పందించి కంకరను తొలగించాలని వాహనదారులు వేడుకుంటున్నారు.
30 వరకు అడ్మిషన్లు
కాటారం: ఓపెన్ స్కూల్ అడ్మిషన్స్ స్పెషల్ డ్రైవ్‌లో భాగంగా అపరాద రుసుంతో ఈ నెల 30 వరకు ఓపెన్ టెన్త్, ఓపెన్ ఇంటర్‌లో అడ్మిషన్స్ కోసం అవకాశం కల్పించినట్లు కాటారం వివేకానంద ఓపెన్ స్కూల్ సెంటర్ కోఆర్డినేటర్ వలుస వెంకటేశ్వర్లు తెలిపారు. ఆసక్తి గల అభ్యర్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. మరిన్ని వివరాలకు మండల కేంద్రంలోని వివేకానంద పాఠశాలలో లేదా సెల్ నంబర్ 9440399715లో సంప్రదించాలని కోరారు.
వృథాగా సాగునీరు
గోవిందరావుపేట: మండలంలోని లక్నవరం సరస్సులోని సాగునీరు వృథాగా పోతుంది. రెండు రోజుల క్రితం నర్సింహుల కాల్వ నీటిని విడుదల చేశారు. కాల్వలో అక్కడక్కడ పంట పొలాల్లోకి నీటిని విడుదల చేయడానికి తూముల వద్ద షట్టర్లు ఉండగా తుప్పు పట్టయడంతో తీసివేశారు. కానీ మళ్లీ వాటి కొత్త షట్టర్లు బిగించలేదు. దీంతో నీరు వృథాగా పోతుంది. ఇప్పటికై నా అధికారులు స్పందించి షట్టర్లు బిగించాలని రైతులు కోరుతున్నారు. ఇలాగే నీరు వృథా పోతే యాసంగి పంటకు నీరు సరిపోక పంటలు ఎండిపోయే అవకాశం ఉందని రైతులు వాపోతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment