చాక్‌పీస్‌పై క్రిస్మస్ ఆకృతులు
కాటారం: మండల కేంద్రంలోని గిరిజన సంక్షేమ బాలుర గురుకుల కళాశాలలో ఆర్ట్ ఉపాధ్యాయుడిగా పని చేస్తున్న ఆడెపు రజనీకాంత్ సూక్ష్మ కళాకృతులను తయారు చేసి అబ్బురపరుస్తున్నారు. క్రిస్మస్‌ను పురస్కరించుకొని రజనీకాంత్ చాక్‌పీస్‌పై ఏసుక్రీస్తూ, ఆంగ్ల అక్షరాలతో హ్యాపి క్రిస్మస్, క్రిస్మస్ స్టార్, శాంటాక్లాజ్ ఆకృతులను తయారు చేశారు. 3 సెంటిమీటర్ల ఎత్తు ఉన్న చాక్‌పీస్‌పై ఏసుక్రీస్తును, 2 మిల్లీమీటర్ల ఎత్తు, 2 మిల్లీమీటర్ల వెడెల్పు ఉన్న చాక్‌పీస్‌పై హ్యాపీ క్రిస్మస్ ఆంగ్ల అక్షరాలు మూడు గంటల పాటు శ్రమించి రూపొందించి క్రైస్తవులకు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. అంతేకాకుండా ఒక సెంటిమీటర్ వెడెల్పున్న క్రిస్మస్ స్టార్, పిల్లలకు బహుమతులుగా తీసుకొచ్చే శాంటాక్లాజ్‌ను, 2 సెంటిమీటర్ల ఎత్తు, 8 మిల్లీమీటర్ల వెడెల్పుతో క్రిస్మస్ ట్రీని గుండు పిన్ను సహాయంతో నాలుగు గంటల పాటు శ్రమించి తయారు చేసినట్లు రజనీకాంత్ తెలిపారు. రజనీకాంత్ గతంలో ఇలాంటి సూక్ష్మ కళాఖండాలు సృష్టించడంతో పాటు సమరయోధుల ఫొటోలను రూపొందించడం, బియ్యపు గింజలపై 278 అక్షరాల జాతీయ గీతం, జాతీయ గేయం రాసి బుక్ ఆఫ్ స్టేట్ రికార్డ్, సృజనపుత్ర, కళారత్న, రికార్డ్ హాల్డర్స్ రిపబ్లిక్ ఇండియా రికార్డు, తెలంగాణ బుక్ ఆఫ్ రికార్డు, తెలుగ్‌బుక్ ఆఫ్ రికార్డులను సొంతం చేసుకొన్నారు.
చిత్రకళ ఉపాధ్యాయుడు
రజనీకాంత్ ప్రతిభ
Comments
Please login to add a commentAdd a comment