బస్టాండ్ పునర్నిర్మాణంపై మంత్రి దృష్టి
కాళేశ్వరం: మహదేవపూర్ మండలం కాళేశ్వరం ఆర్టీసీ బస్టాండ్ పునర్నిర్మాణంపై మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు దృష్టి సారించారు. ఈ మేరకు స్థానిక నాయకులతో మంత్రి మంగళవారం రాత్రి బస్టాండ్ ఆవరణలో పరిశీలించారు. త్వరలో జరుగనున్న సరస్వతినది పుష్కరాలకు వివిధ రాష్ట్రాల నుంచి భక్తులు భారీగా తరలివస్తారని, వారి సౌకర్యార్థం బస్టాండ్ పునర్నిర్మాణంపై చర్యలు తీసుకుంటానన్నారు. ప్రస్తుతం ఉన్న చోటు కాకుండా ఇతర ప్రాంతంలోకి బస్టాండ్ మర్చాలని మంత్రి తెలుపగా, స్థానికులు అదే చోట ఉండాలని, అందరికి అందుబాటులో ఉంటుందని అన్నారు. బస్టాండ్ నుంచి గోదావరి వరకు రోడ్డు వెడల్పుతో సెంట్రల్ లైటింగ్ చేపట్టాలని స్థానికులు తెలిపారు. రోడ్డు వెడల్పులో డ్రెయినేజీతో పాటు ఇరువైపులా 8 నుంచి 10ఫీట్ల మేర రోడ్డు వెడల్పు పెంచాలని స్థానికలు మంత్రికి సూచించారు. ఆయన వెంట నాయకులు రాణిబాయి, కోట రాజబాపు, శ్రీనివాసరెడ్డి, అశోక్, ప్రభాకర్‌రెడ్డి, శకీల్, బాబా, రాజబాబు, లక్ష్మణ్‌లు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment