జయశంకర్ భూపాలపల్లి
బుధవారం శ్రీ 25 శ్రీ డిసెంబర్ శ్రీ 2024
అయ్యప్ప ఆశీస్సులు ఉండాలి
9
కాళేశ్వరం: అయ్యప్ప స్వామి ఆశీస్సులు, కృప రాష్ట్ర ప్రజలకు ఉండాలని, రాష్ట్రం అభివృద్ధి పథంలో నడవాలని రాష్ట్ర ఐటీశాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు అన్నారు. మహదేవపూర్ మండల కేంద్రంలోని అయ్యప్పస్వామి ఆలయంలో మంగళవారం నిర్వహించిన మహాపడి పూజ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రజలు సుఖసంతోషాలతో జీవించాలన్నారు. స్వామివారి ఉత్సవ విగ్రహానికి పంచామృతాలతో నైవేద్యం సమర్పించి, విశేష పూజలను వేదపండితులు నిర్వహించారు. అనంతరం పదునెట్టాంబడి పూజను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ట్రేడ్ ప్రమోషన్ కార్పొరేషన్ చైర్మన్ ఐత ప్రకాశ్‌రెడ్డి, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు రాజబాపు, మాజీ ఎంపీపీలు అక్భర్‌ఖాన్, రాణిబాయి, పీఏసీఎస్ చైర్మన్ తిరుపతి, నాయకులు అశోక్, శ్రీనివాసరెడ్డి, విలాస్‌రావు, సమ్మయ్య, సత్యనారాయణ పాల్గొన్నారు.
ఏసు మార్గం అనుసరణీయం
కాటారం: సమస్త మానవవాళికి ప్రేమ, శాంతి మార్గం చూపిన మహానీయుడు ఏసు అని.. ఆయన మార్గం ప్రతీ ఒక్కరికి అనుసరణీయం, స్ఫూర్తిదాయకం అని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు అన్నారు. కాటారం మండలకేంద్రంలోని బీఎల్‌ఎం గార్డెన్స్‌లో రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో మంగళవారం క్రిస్మస్ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలకు మంత్రి శ్రీధర్‌బాబు ముఖ్య అతిథిగా హాజరై క్రైస్తవ మత పెద్దలతో కలిసి ప్రత్యేక ప్రార్థనలు చేశారు. కేక్ కట్ చేసి క్రైస్తవులకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా మంత్రి శ్రీధర్‌బాబు మాట్లాడుతూ రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజల సంక్షేమం, అభివృద్ధే ధ్యేయంగా ప్రభుత్వం ముందుకెళ్తున్నట్లు తెలిపారు. హిందువులు, ముస్లిం, క్రైస్తవ మతస్తులకు సంబంధించిన నిర్మాణాల కోసం మండలంలో ప్రభుత్వ భూముల కేటాయింపు చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. ఆక్రమణకు గురైన ప్రభుత్వ భూములను స్వాధీనం చేసుకోవడానికి చర్యలు చేపట్టాలని సబ్ కలెక్టర్‌ను ఆదేశించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో కాటారం సబ్ కలెక్టర్ మయాంక్‌సింగ్, ట్రేడ్ ప్రమోషన్ కార్పొరేషన్ చైర్మన్ ఐత ప్రకాశ్‌రెడ్డి, కార్యక్రమం కోఆర్డినేటర్ సుందిళ్ల ప్రభుదాస్, క్రైస్తవ మతపెద్దలు, క్రైస్తవ మతస్తులు పాల్గొన్నారు.
మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు
మహాపడి పూజలో పాల్గొన్న మంత్రి
Comments
Please login to add a commentAdd a comment